చట్టాల పై అందరికి అవగాహన ఉండాలి : - చైర్మన్ దానం


పిఠాపురం : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు  చేసారు ..  ముఖ్య అతిథిగా పిఠాపురం పురపాలక సంఘం ఛైర్మెన్ దానం లాజర్ బాబు పాల్గొని  భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కోసం ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అందులో ఉన్న చట్టాలను ప్రతీ ఒక్కరు తెలుసుకొని జీవించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ డా.పోట్నూరి రజనీకాంత్ పాల్గొని వారు ఏర్పాటు చేసిన 100 భారత రాజ్యాంగం పుస్తకాలను ఛైర్మెన్ చేతులు మీదుగా ఆవిష్కరించి గ్రంథాలయాలకు మరియు స్కూళ్లకు అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్  మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు అంబేద్కర్ సూచించిన మార్గంలో ప్రయాణం చేయాలన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్మన్ దానం లాజర్ బాబును పొట్నూరీ రజినీకాంత్, మన ఊరు మన బాధ్యత స్వచంద సేవా సంస్థ మరియు శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం తరుపున సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శి కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్, కారుకొండ లోవరాజు, బి.ఏ.దాసు, బాలెం నూకరాజు మరియు గ్రంథాలయ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు