స్వార్థం,స్వలాభం: - అచ్యుతునిరాజ్యశ్రీ
 

మనసుఖసంతోషాలకోసం మనబంధు మిత్రులను ఇబ్బందుల పాలు చేయరాదు.పాముకు కప్ప  ఆహారం అని మనకు తెలుసుకదా? కానీ పాము మాయమాటలకు కప్ప మోసపోయి తన వారినందరినీ పాముకు బలిఇచ్చి ఆఖరికి అదీ చచ్చింది. 
ఆపెద్దపాము మహాసోమరిపోతు, కుటిల బుద్ధి గలది.ఓరోజు నీరసంగా అటూ ఇటూ కదులుతుంటే  కప్ప రాజు అడిగింది" ఏమైందిమామా,నీకు?" "ఏంచెప్పేది అల్లుడూ! నేను ఓముని పుత్రుని కాటేయటంతో అతను చనిపోయాడు.ముని శపించాడు" నీవు కప్పలని మోస్తూ జీవితాంతం బతుకు" .అందుకే మీకు ఊడిగం చేయాలనే నేను తిరుగుతున్న. నాపై మోసుకెల్తా. షికార్లు కొడతా! మీపిల్లల్ని ఆడిస్తా.ముసలికప్పల్ని మోస్తా". ఇంకేముంది? కప్పలరాజు నమ్మింది. ఓవారం రోజులు హాయిగా కప్పలు పాముపై సవారీ చేస్తూ ఆనందించాయి.ఓరోజు పాము అంది" కప్ప రాజా!మీ అందరినీ మోసి బాగా బలహీనపడ్డాను. ఇక నావల్లకాదు." " అయ్యో,అలాఅనకు మామా! ముసలికప్పల్ని తినేసేయ్!" ఇంకేముంది ఓరెండ్రోజులకల్లా దాదాపు అన్నికప్పలు గుటకాయస్వాహా అవటంతో, కప్ప రాజు నిలదీసింది. అంతే పాము దాన్ని కూడా అమాంతం మింగేసింది. మన వారిపై కోపంతో శత్రువులని నమ్మరాదు.మనం దేశ ద్రోహులతో భాయీభాయీ అనిచేయి కలపరాదు. అలా మన స్వదేశీరాజుల స్వార్థం వల్ల మన దేశంపై విదేశీదండయాత్రలు, ఆపై బ్రిటిష్ పాలనలోమనం ఎలా బానిసలు గా బతికామో చరిత్ర చెప్తోంది.ఇప్పుడు కులమత గణన పార్టీల కొట్లాటలతో దేశం విచ్ఛిన్నమైతే  ఇంతే సంగతులు.అందరూ గ్రహించి మనలో మనం పోట్లాడుకుంటే మనకే కష్టం నష్టం అని మేరాభారత్ మహాన్,యువత దేశానికి భవిత అని గ్రహిస్తారు కదూ?🌹
కామెంట్‌లు