భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, విధులు,ఆదేశిక సూత్రాలను అందించిందనీ, ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్దదనీ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు అధ్యయనం చేయడంతో పాటు, అవగాహన కలిగి ఉండాలి అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు అన్నారు.
నవంబర్ 26న యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి అంజలి ఘటించారు.
ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి గారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కును కల్పించిందనీ హక్కుల తోపాటు విధులను బాధ్యతగా నిర్వహించాలనీ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత గుర్తించి బాధ్యతగల పౌరులుగా ఎదుగాలనీ, రాజ్యాంగంలోని అంశాలను చదివి నిత్య జీవితంలో ఆచరిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, అనుముల రవిచంద్ర, వెల్దండి సౌమ్య, అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్,ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి