సామెత -422 : - ఉన్నది మనిషికి పుష్టి - గొడ్డుకు తిన్నది పుష్టి
***
ఇగ్గో అవ్వా! గా పోరడికి శెప్పీ శెప్పీ నా నోరు వడిపోయింది గని,గానిలో ఆవగింజంతన్న తేడా వొత్తెనా? గదే పోబడి పోయిండు. గిప్పుడేమో శేతులు ముందేసుకుని ఎవలి పంచెన శేర్తే బతుకెళ్ళుద్దా అని ఎతక బట్టిండు. ఎవ్వలైనా రొండు మూడు దినాలు, జాలి దయున్నోలు ఇంకో రెండు దినాలు బరిత్తరు గని ఎవలెందుకు దినాల కొద్దీ కూసబెట్టి బువ్వ వెడ్తురు శెప్పు. "
"ఎవలా పోరడు శెల్లే? గంతగనం ఒకల మీద బడి బత్కే పరిత్తితి ఎందుకొచ్చిందంట?"
"ఎందుకొచ్చిందంటే ఏం శెప్పనవ్వా! వొక్క వారం దినాలు పనికి బొయ్యిండంటే, ఎక్కల్లేని ఆపసోపాలు పడ్తడు.గీ దునియాల గంత కట్టం ఎవలు శెయ్యలేదనుకునుడు.ఇంగ శేతుల పడితెలు పడంగనే ఏం దిందాం?ఎట్ల జెల్స జేద్దామన్నదే గాని జ్యాస. పెళ్ళాం ఎంత మొత్తుకుంటేంది. శేతుల ఉన్నప్పుడైన మంచిగ, పుష్టిగ తినొద్దా ? అన్కుంట గాని పొల్లగాండ్లకు సుత తిండి యావ అల్వాటు జేసిండు."
"రేపెట్లన్న సోయి లేకుండా కర్సు బెట్టుడు. ఎప్పుడు ఒక్క తీర్గ ఉంటదా అవ్వా!బతుకు. పొల్లగాండ్లు పెర్గబట్టిరి.సద్వులూ, తిండీ బట్ట సూస్కోవాలె. ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది ఊకెనే రావు గద! పతొక్కటి కొనుక్కోవాలె.ఒగప్పటి దినాలు కావు గద. యెయ్యి రూపాయిలకే నెలంత యింటోళ్ళందర్కి సరిపడేన్ని సౌదలొచ్చేయి.గిప్పుడట్లున్నదా శెప్పవ్వా?"
అవును శెల్లే! మనమేవన్న గొడ్లమా ఏంది? బర్రె లెక్కనో,గొర్రె లెక్కనో తిని పుట్టిగుండేతందుకు? మడుసులం వొంట్లె కూసింత బలము,శత్తి ఉన్నప్పుడే నాల్గు రాళ్ళు ఎన్కేసుకోవాలె? గా పడితెలు శేతుల వుంటెనే మన్సుకు,మడిషికి జెరంత దైర్నంగ వుంటది.ఒకల్ని శెయ్యి సాపే పరిత్తితి రాదు."
"అవునవ్వా! మా అన్న దోత్తు ఒకాయన వుండు. గాయిన మొగ బిలగాని కోస్రం సూత్తె ముగ్గురు ఆడివిల్లలే పుట్టిర్రు.గట్లని జెరంత బుగులు వడ్డడు గని పిల్ల పుట్టంగనే గా పిల్ల పేర్న కాయ కట్టం జేస్కున్న దాంట్లె దీశి గింత దాసుడు. ముగ్గురాడివిల్లలకు గట్లనే పోట్టాపీసుల బేంకుల గా పొల్లల పేర్న దాశిండు.మంచి సద్వులు జెప్పిచ్చిండు. మంచి సంవందాలు జూసి లగ్గాలు జేసిండు. గాయిన ఊల్లె పతొక్కలు అయ్యో పాపం ముగ్గురాడివిల్లలు. ఎట్ల సాత్తడో,ఎట్ల పెంచి లగ్గాలు జేత్తడో, పురుళ్ళు పున్నేల కారియాలు ఎల్లదీత్తడో అనుకుర్రవ్వ! ఎక్కడ శిన్నమెత్తు తేడా రాకుండా ముగ్గర్ని సమదీటిగ సూశిండు. గిప్పటికి పతేడాది ఆడివిల్లల్ని అల్లుండ్లని,మన్వలు మన్వరాండ్లని పిల్సుకునుడు ఉన్న దాంట్లో తలాయింత బెట్టి ప్రేమ జేస్కునుడు."
"గదే శెల్లే! నాల్గు పైసలు గాయిన తాన ఉండవట్టే గద.గియ్యాల ఏ రంది లేకుంట ఉన్నడాయిన. గందుకే శెల్లే! "ఉన్నది మనిషికి పుష్టి - తిన్నది గొడ్డుకు పుష్టి" అంటరు. పైసా మే పరమాత్త హై అంటరు. గందుకే గొడ్డు లెక్క తిన్నది లెక్క గాదు.ఉన్నది లెక్క. గట్ల పైసలు దాస్కొని పెంపు జేస్కుంటే ఏం మడిషికైన పెద్ద పెద్ద పైసల కట్టాలు వుండవు శెల్లే!"
"కొంత మందిరికి ఎంత కట్టబడ్డా అవుసరమైన ఆమ్దాని లేక సంసారం ఈదుడు కట్టమై గిలగిలలాడుతుంటరు. శానామందిరికి ఆమ్దాని ఉన్నా గా దాన్ని యిట్టమొచ్చినట్టు కర్సు వెట్టి ఇగ్గో మన దూలయ్య లెక్క కింద మీద అయితుంటరు శెల్లే!"
"అవునవ్వా! నువ్వన్న మాట అచ్చర సత్తెం. ఉన్నదే మనిషికి పుట్టి అవ్వా! ఏం కులమైతేంది? మత మైతేంది? ఉన్నోళ్ళ ముక తెల్వి ఏరే ఉంటది. అయిన గని గీ దినాలల్ల ఆళ్ళు ఈళ్ళు అని సూడకుండ మడుసుల తాన ఉన్నదాన్ని సూశే గాల్లకి యిలువ యిత్తుర్రు"
'అవును శెల్లే! బాగా ఉన్నోడు యిట్ట మొచ్చి తిన్నా... గాళ్ళేంది బాగ బల్శినోళ్ళు. గాళ్ళు పెట్టే కర్సు శేతికున్న దుమ్ము దుల్పినంత - తింటే ఏంబోతది అన్కుంటరు.బాగ సంపాయిచ్చుకున్నంక అప్పుడప్పుడు తింటే ఏంగాదు గని,సంపాదన సరింగ లేని వాడు వాల్లొతికె శేత్తనంటె ఎట్ల?వొల్లు దెగ్గిర బెట్కొని బత్కాలె."
గదండీ సంగతి! "ఉన్నది మనిషికి పుష్టి - తిన్నది గొడ్డుకు పుష్టి"- అంటే గిదే మరి.గీ శాత్రం సద్విన అందర్కి అర్థమైంది కదురుల్లా!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి