సామెత -425; ఉన్న ఊరికి చేసిన ఉపకారం - శవానికి చేసిన సింగారం వృధా అన్నట్టు
****
" పాపం గదేందవ్వా!గట్ల జేత్తుర్రు. గా మడిషిని ఒక్కలంటే ఒక్కలు లెక్క శేసుడు లేదు.ఏమో గట్ల జేసుడు నాకే ఎట్లనో అన్పిచ్చింది".
"ఏంది శెల్లే, ఏ మడిషి ముచ్చెటి నువ్ శెప్పేది? ఎందుకట్ల లెక్క జేత్తల్లే.గా మడిషేమన్న శిన్న శితకోడా? మంచోడు గాదా ఏంది? గీ దినాలల్ల గసుమంటోళ్ళని ఎవలు పట్టిచ్చుకుంటుర్రు శెల్లే! పైసల్లేనోడు,బక్కోడు,బలీనుడంటే గీ పెపంచకంల పతొక్కల్కి శిన్న సూపే శెల్లే!గట్ల గావాల్నని గట్లుండాల్నని ఎవలైన అన్కుంటరా? ఎందుకో గని గాల్లని మా సుల్కనగ సూత్తుంటరు."
" అవునవ్వా! గాల్లంటే ఎవలికేం శెయ్యలేరనే గద గంత సుల్కన.మరి గీయన ముచ్చెటి గట్ల గాదవ్వా! గాయిన శేసిన పన్లు శెప్తే నువ్వైతే గంత మంచాయినా? అని శేతులెత్తి మొక్కుతవ్."
"అవునా శెల్లే? గంత మంచాయినా! ఏం మంచి జేశిండేంది?"
"గాయిన ఊల్లె శిన్నబల్లె, పెద్ద బల్లె పిల్లగాండ్ల కోస్రం మంచినీళ్ల మిషన్లు కొనిచ్చిండు.తొవ్వపొంటి,పక్కన ఎక్కడ వడ్తే అక్కడ గలీజు శేత్తుంటె గట్ల శెయ్యకుర్రి బీమార్లొత్తయని శెప్పి, ఇంటికో పాయిఖాన దొడ్డి కట్టిచ్చుకోమని పైసల సాయం శేసిండు. కట్టిచ్చుకునే దన్క ఎంట వడ్డడు. అందరు సద్వుకునేందుకు నడిమద్దెల ఊల్లె పెద్ద ఇల్లస్మంటిది కట్టిపిచ్చిండు.గిన్ని శేసినా మనూరోల్లు ఒక్కలు సుత గాయిన్ని తల్సుడు లేదవ్వా!"
"వో శెల్లే! నువ్ శెప్పేది గా సుందరయ్య తాత ముచ్చెటినేనా? గాయినెంత మంచోడో ఎంత శెప్పినా తక్వే శెల్లె. ముస్లోల్లు, ముత్కోళ్ళు,కడ్పుతో ఉన్నోళ్ళు దవాఖానా అవుస్రాలకి పేటకి పోవాలంటే మా కట్టంగుండేది. గజ్జూల్లేక బస్సు ఊల్లెకి వచ్చేతందుకు పెద్దోళ్లు,మంతుర్ల ఎంటవడి గదొచ్చేతందుకు కాల్ల శెప్పులు అరిగే దన్క తిరిగిండు.గట్ల శెప్పుకుంట బోతే శానా శానా ఉన్నయి శెల్లే!"
"అవునవ్వా! గంత జేశినా ఒక్కలికన్న నెనరుందా శెప్పు."
"ఇగ్గో శెల్లే! గిప్పుడు శేసిన దాన్కి గింతకి డబల్ శబల్ శేసినా ఎవ్వలూ శేసిర్రని అనరు గందుకే మన పెద్దోళ్ళు గిసుమంటియి సూశి ఏవన్నరో తెల్సా."
" గదే శెల్లే! " ఉన్నూరికి శేసిన ఉపకారం- శవానికి శేసిన సింగారం వుర్దా" అని ఊకెనే అన్లే. గట్లనే వుంది మన సుందరయ్య తాత శేసిన పని. అయితేవాయెతీ శేసిన దరుమం శెడని పతార్థమంటరు. మన తాత శేసిన పని సుత గట్లనే...ఎవలో అన్కుంటరనీ,మెచ్చుకుంటరని శెయ్యలేదు గద.గాయిన పున్నెం గాయినెంటనే ఉంటది."
"గదండీ సంగతి! "ఉన్న ఊరికి చేసిన ఉపకారం -శవానికి చేసిన సింగారం వృధా అన్నట్టు" అంటే గిదే. ఊరికి ఎంత శేసినా ఇంకా శేత్తె బాగుండు, గంతుంది, ఇంతుంది శేత్తేమైతదనే అన్కుంటరు తప్ప గంత సాయం జేసిండు ఎంత మంచోడని అన్కోరు. గట్లనే సచ్చిన శవానికి ఎన్ని సింగారాలు శేత్తే మాత్తరం ఏవుంది. శచ్చినోళ్ళు బత్కొత్తరా? రారు గద.గంద్కే గిట్ల పోల్శి ఓ శాత్రమే శెప్పిర్రు."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి