ఇది సత్య యుగమా?: - కోలా లక్ష్మీపతి , తిరుపతి 1. ఆదివారం గడవాలనే చింత లేదు. 2. సోమవారం వస్తుందనే భయం లేదు. 3. డబ్బు సంపాదించాలనే మోహము లేదు. 4. ఖర్చు పెట్టే ఆసక్తి లేదు. 5. హోటల్ లో తినాలనే కోరిక లేదు. 6. బయట తిరిగే ఆలోచన లేదు. 7. బంగారం వెండి పై మోహము లేదు. 8. కొత్త బట్టలు ధరించాలనే ఆతృత లేదు. 9. సుందరంగా తయారవ్వాలనే చింత లేదు. "మనం మోక్ష ద్వారం చేరుకున్నామా?" ఏమో కలియుగం సమాప్తమై సత్య యుగం వచ్చేసిందేమో.." * పూజా, వ్రతం, పరివారం జతలో, ఉపవాసం, రామాయణం మరియు మహా భారతం * కాలుష్య రహిత వాతావరణం * పరుగుతో నిండిన జీవనం సమాప్తి * సాధారణ జీవనం * అందరూ రొట్టె:పప్పు తింటున్నారు * అందరూ సమానమే..అనే భావన * ఏ నౌకర్లు లేదు..ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు * ఖరీదైన బట్టలు, ఆభరణాలు ధరించాలి అనే ఆశ లేదు * ప్రజలు అపార దాన ధర్మాలు చేస్తున్నారు * అహంకారం శాంతించింది..* పిల్లలు అందరూ ఇంటికి వచ్చి తల్లి తండ్రుల తో కలిసి ఉంటున్నారు " ఇది సత్య యుగం కాక పోతే ఇక ఏంటి?"


కామెంట్‌లు