ఆరోగ్యాన్నిచ్చే రసాలు -10: -- యెందా కాలం లో బయట ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మన శరీరం లోని నీటి శాతం తగ్గి పోయి త్వరగా అలసి పోతారు .కొందరికి ముక్కు లోంచి రక్తం కారడం మూత్ర ద్వారం లో మంట మొదలవుతుంది కొన్ని దేశీ గులాబీల రిక్కాలను శుభ్రంగా కడిగి ఒక గిన్నె లో ఎక్కువ భాగం నీరు పోసి అందులో యాలకుల పొడి తగినంత పంచదార వేసి మరిగించి చల్లార్చి వడ కట్టు కోవాలి . ఈ పానకంలో ఒక కప్పు దానిమ్మ గింజల రసం +నిమ్మ రసం కలపాలి మంచి రుచికరమైన పానీయం తయారవుతుంది. ఇది ముక్కులోనే రక్త స్రావాన్ని ఆపుతుంది. మూత్ర ద్వారం లోని మంటను పోగొడుతుంది. గుండెకు శక్తినిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచి. చల్లదనాన్ని ఇస్తుంది.- పి . కమలాకర్ రావు


కామెంట్‌లు