వారితో బలే అనుభవమే --స్వరూప అనే పేరు స్ఫురించేటప్పుడల్లా నా మనసు 1983 ప్రాంతంలోకెళ్తుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో నేను ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థలో ఓ ఏడాదిన్నర పాటు పని చేశాను. దినసరి కూలీగా పదిహేను రూపాయలకు పని చేశాను. వికలాంగుల సంస్థ, పంజగుట్టలోని నిజామ్స్ ఆస్పత్రి సంయుక్తంగా కలిసి కృత్రిమ కాలు, పోలియోతో బాధ పడుతున్న వారికి కాలిపర్స్ తయారు చేస్తుండేవి. ఈ విభాగం నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోనే ఉండేది. ఈ వికలాంగుల కార్పొరేషన్ సంస్థకు డాక్టర్ ఎ.పి. రంగారావుగారు ఎండీగా ఉండేవారు. ప్రధాన కార్యాలయం అప్పట్లో విజయనగర్ కాలనీలోని శాంతినగర్లో ఉండేది. నిమ్స్ ఆవరణలోని వర్క్ షాప్ లో యనమండ్ర సోమసుందరంగారు (వికలాంగుల సంస్థ ఉద్యోగి), కె.డి. షెట్టి (నిమ్స్ ఉద్యోగి) పర్యవేక్షణలో ఓ పది పదిహేనుమంది దాకా పని చేశాం. ఇక్కడ మా సహ ఉద్యోగులలో అధికశాతం మంది వికలాంగులే. వారిలో స్వరూప, సభిత, ప్రభు, జనార్దన్ తదితరులుండేవారు. మా విభాగానికి వచ్చే పేషంట్లకి ఫోటోలు తీసివ్వడం జనార్దన్ పని. అనంతరం అతనికి బ్యాంకులో జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. అతనికన్నా ముందే నేను బయటకు వచ్చేశాను. నేనూ జనార్దన్ పక్కపక్కనే కూర్చునేవారం. అప్పట్లో కాకర్ల సుబ్బారావుగారు నిమ్స్ కి అధిపతి. మాతో కాలిపర్స్ , జైపూర్ ఫుట్ (కృత్రిమ కాలు) వంటివి తయారు చేసే విభాగంలో స్వరూప పని చేసేవారు. ఆమె గురించి అంతకుముందే నేను పేపర్లలో చదివాను. "స్వరూపకు కాలొచ్చింది" అనే శీర్షికతో పాత్రికేయులు జి. కృష్ణగారు ఆంధ్రప్రభలో ఓ వ్యాసం రాశారు. ఈ వ్యాసం బాగా గుర్తు. తన గురించి పేపర్లలో వచ్చిన వ్యిసాల గురించి అప్పుడప్పుడూ చెప్తుండేది స్వరూప. ఆమె బలే చలాకీపిల్ల. మనసులో ఒకటి బయటొకటి కాకుండా అనుకున్నది అనేసేదీ అమ్మాయి. ఆ అమ్మాయితో కలిసి సబితా మాట్లాడేసేది. ఇక ఫోటోగ్రాఫర్ జనార్దన్ విషయానికొస్తే మాటలు వచ్చేవికావు. అతను అడిక్ మెట్లో ఉండేవాడు. వాళ్ళమ్మగారు రచయిత్రి. పేరు పెదపూడి రాజ్యలక్ష్మిగారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ హైదరాబాదుకి వచ్చినప్పుడు కలిశానుకూడా.జనార్దన్ తో ఓ సంఘటన మరచిపోలేను. ఓరోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరాం. నిమ్స్ ఎదురుగుండానే రామ్ నగర్ కొచ్చే బస్సు వచ్చేది. బస్టాప్ దగ్గర్లో ఓ బండిమీద మామిడిపళ్ళు అమ్ముతున్నారు. అవి కొనాలనిపించింది. నాకు మొహమాటం ఎక్కువనే జనార్దన్ కి తెలుసు. అందువల్ల నన్ను ఆ బండిదగ్గర నోరు విప్పొద్దని, మాటలు రాని వాడిలా నటించమన్నాడు. అతను గట్టివాడే. ఇద్దరం ఆ బండి దగ్గరకెళ్ళాం. జనార్దన్ సౌంజ్ఞలను బట్టి మా ఇద్దరికీ మాటలు రావనుకున్న వ్యాపారి ఏమనుకున్నాడేమో కానీ ఓ పది రూపాయలు తగ్గించి మాకు మామిడిపళ్ళు ఇచ్చాడు. ఆఫీసులోనే కాకుండా ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళం బస్సులో. అలా కలసి ప్రయాణం చేస్తున్నప్పుడల్లా మూగవాళ్ళు సౌంంజ్ఞలతో మాట్లాడుకునే మాటలన్నీ నేర్పించాడు. మంచి మిత్రుడు. ఇద్దరం నిమ్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన కొన్నేళ్ళకు ఫేస్ బుక్ ద్వారా మళ్ళీ కలిశాం. వాళ్ళింటికి కూడా వెళ్ళాను. పెళ్ళయింది. బాగానే స్థిరపడ్డాడు. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుం టుంది...దేవుడు అన్ని అవయవాలతో సవ్యంగా పుట్టించిన నాకన్నా మంచితనం, ధైర్యం స్వరూప, జనార్దన్ వంటివారికి అధికంగానే ఇచ్చాడని. నిమ్స్ ఆవరణలో నాతో పని చేసిన సహ ఉద్యోగలు తమ తమ అవయవలోపాలను అధిగమించి మానసిక స్థయిర్యాన్ని ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోకుండా పని చేసేవారు. వారితో కలసిమెలసి పని చేసిన రోజులు చిరస్మరణీయమే నాకు!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం