అబ్బబ్బో చెప్పతరమా - (బాల గేయం) మా ఊరి చెరువుకు నేను వెళ్ళాను గలగలా పారేటి నీళ్ళు చూసాను ఒక్కొక్క గులకరాయి నీట వేసాను గట్టుమీదనుండి చూస్తు గంతులేసాను ఎగిసిపడే అలల మీద నీటి బుడగలు ఒడ్డుపైన నవ్వేటి కెరట నురగలు బుడుగు బుడుగుమంటు మునుగు చేపపిల్లలు వెంటాడి వేటాడే కొంగకూనలు ఆకుపచ్చ తీగలపై తామరమ్మలు ఆ పక్కన తెల్లనైన కలువ పువ్వులు అద్దమంటి నీటిలో ఆకాశము ఆ మధ్యన ఎర్రనైన సూర్యబింబము ఎత్తైన కొండలన్ని నీటిలోన ఊయలూగి కదలాడే అలలపైన ఎగిరేటి పక్షులతో నీటి అందము అబ్బబ్బో!చెప్పతరమ చెరువు ఘనతను త్రిపురారి పద్మ జనగామ.


కామెంట్‌లు