ఇదీ అంతే!!--నేను మద్రాసులో సన్ టీవీ గ్రూప్ లో పని చేస్తున్న రోజులవి. ఓరోజు గండూరి రాజశుక మాటగా పాండిబజారులో ఉన్న నాయుడుహాల్ అనే పెద్ద బట్టల దుకాణానికి వెళ్ళాను. అక్కడ ఒకరు ఓ తమిళ పుస్తకం ఇచ్చి తెలుగులో అనువదించి పెట్టమన్నారు. సరేనని రాసిచ్చాను. కొయంబత్తూరు సమీపంలోని పొల్లాచ్చిలో వేదాద్రి మహర్షి ఆశ్రమం ఉంది. చాలా చాలా బాగుంటుంది. వేదాద్రి మహర్షి గురించి పుస్తకమది. చిన్న పుస్తకమే. వేదాద్రి మహర్షిని ఆరాధించే చిన్నసామి (పొల్లాచ్చి) ఈ పుస్తకం రాయించారు. ఏకకాలంలో తెలుగులోనూ, కన్నడంలోనూ ఈ పుస్తకం అనువాదమైంది. తెలుగులో నేను అనువదించగా కన్నడంలో ఎవరు రాశారో గుర్తు లేదు. పుస్తకం రాయడం పూర్తి చేసి రాతప్రతిని నాయుడు హాల్ వారికిచ్చాను. వాళ్ళు చిన్నసామికి పంపారు.అనంతరం చిన్నసామిగారి నుంచీ ఫోన్. "ఫలానా తారీఖున పుస్తకావిష్కరణ కార్యక్రమముంది. మీరు మీ కుటుంబసభ్యులతో రావాలి" అన్నదే ఆ ఫోన్ కాల్ కబురు. నేను మా ఆవిడ రేణుక, అబ్బాయి సాత్యకి పొల్లాచ్చి వెళ్ళాం. ఊరు ఊరంతా కొబ్బరి చెట్లు, అరటిచెట్ల తోటలే. ఈ తోటలతో చాలా రమణీయంగా కనిపిస్తుంది ఊరంతా. ఆహ్లాదకర వాతావరణం. కిక్కిరిసిన జనసందోహం మధ్య తెలుగు, కన్నడం భాషలలో వేదాద్రి మహర్షి పుస్తకాల అవిష్కరణ జరిగింది. నాతోపాటు కన్నడ అనువాదకుడినీ సన్మానించారు. నా జీవితంలో పొందిన మొట్టమొదటి సత్కారమదే. కార్యక్రమానంతరం ఆశ్రమంలోనే భోంచేశాం. తర్వాత పొల్లాచ్చిలో చిన్నసామి గారింటికి వెళ్ళాం. అక్కడ ఓ రెండు గంటలుపైనే గడిపాం. చిన్నసామి మాతోపాటు వచ్చి మద్రాసు బస్సెక్కించారు. ఇంటికి చేరాం. ప్యాకెట్ విప్పి చూద్దునూ అందులో ఏడు వేల రూపాయలు, ఓ పది పుస్తకాలు ఉన్నాయి. ఘనమైన సత్కారమే అనుకున్నాను. ఆనందం కలిగింది. కానీ ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. కారణం అందులో నేను రాసిన ఒక్క మాటా లేదు. పేరు మాత్రం వేశారు యామిజాల జగదీశ్ అని. ఎందుకేశారో తెలీలేదు. ఓ ప్రముఖ తెలుగు నటుడి కుమార్తె (విజయవాడ) రాయడమో లేక రాయించారనో తెలిసింది. నా శైలి నచ్చనప్పుడు ఎందుకు పిలిపించి సన్మానించడం అని కోపమొచ్చింది. ఫోన్ చేసి మండిపడాలనిపించింది. కానీ ఓ మిత్రుడి సూచనతో ఆ పని చెయ్యలేదు. ఓ పుస్తకం నా పేరుతో అచ్చవడం ఇదే మొదటిది. తొలి పుస్తకం ఇలా నిరాశ పరిస్తే రెండో పుస్తకమైన జెన్ కథలు మరోలా నీరసపరిచింది. మొదటి రెండు పుస్తకాలూ నాకు కలిసిరాలేదు. పేరు నాది. రాసిన వారు మరొకరు. కానీ ఎలాగైనా ఓ చిన్న పుస్తకమైనా నా పేరుతో అచ్చయితే చూసి మురిసిపోవాలనే ఆశ మనసులో ఉంటూనే ఉంది. అది 2010 ఆగస్టులో తీరింది. మా మరదలి కూతురు సమయ గురించి రాసిన చిన్ని పుస్తకం వేసి ఆ పాపతోనే ఆవిష్కరింపచేశాను. అప్పుడు దానికి రెండేళ్ళు. మరో ఆరు నెలలకు మళ్ళీ ఇంకొక పుస్తకంకూడా ఆ పాప గురించే రాశాను. అనంతరం ఓ ఏడాది క్రితం మా నాన్నగారి గురించి ఓ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. ఓ నూటయాభై పేజీల వరకూ నేను రాయగా మరో అయిదు వందల యాభై పేజీలు మా నాన్నగారి వ్యాసాలు, కొన్ని పుస్తక సమీక్షలు సేకరించి టైప్ చేసుంచాను. ఏడు వందల పేజీల పుస్తకం. అంతటి భారీ పుస్తకం వేసే ఆర్థిక స్థోమత లేక ఓ ప్రింట్ అవుట్ మాత్రం తీసుకుని పుస్తకం అచ్చయినంత ఆనందంగా చూసుకుంటూ అప్పుడప్పుడూ పేజీలు తిరగేస్తుంటాను. ఈ పుస్తకం కవర్ పేజీలో మా నాన్నగారి ఫోటోని వి.వి.వి. రమణగారు సెట్ చేసిచ్చారు. దీనికి మోక్షముందో లేదో తెలీలేదు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం