ముల్లా కథలు - 24-గడ్డం!!--ముల్లా ఏదో పని మీద పొరుగు దేశానికి వెళ్ళి చాలా కాలం తర్వాత స్వదేశం చేరుకున్నాడు. అతనికి గడ్డం పెరిగిపోయింది. మిత్రులు అది చూసి "ఏమిటి ముల్లా! ఈ గడ్డమేంటీ? ఈ వేషమేంటీ? ఇది నీ ముఖానికి బాగులేదు" అని అన్నారు."అవును. నాకూ నచ్చలేదు. దీనిని నేనెంతగా అసహ్యించుకుంటున్నానో నాకు మాత్రమే తెలుసు" అన్నాడు ముల్లా. అతని మాటలకు విస్తుపోయిన మిత్రులు "నీకే నచ్చలేదంటే గడ్డం తీసేయొచ్చుగా?" అన్నారు."తీసేయొచ్చు మీరంటున్నట్లు. కానీ చిక్కేమిటంటే ఈ గడ్డం నా భార్యకు నచ్చలేదు.అందుకే గడ్డం తీయకుండా పెంచుతున్నాను" అన్నాడు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు