ఏడుకొండలవాడా.. నీ కొండ‌ను నువ్వే కాపాడుకో*- కోలా లక్ష్మీ పతి మనుషుల వల్ల దేవుడు బతుకుతాడు. దేవుడి వల్ల మనుషులు బతుకుతారు. కరోనాని దేవుడు సృష్టించాడో లేదో తెలియదు కానీ, అది దేవున్ని కూడా భయపెడుతూ ఉంది. ఆయన కూడా మాస్క్ వేసుకోవాల్సిన స్థితి ఏర్పడింది.*తిరుమలకు దారులు మూసేశారంటే , ఒక రకంగా గుడిని మూసేసినట్టే. పూజలు యధావిధిగా జరుగుతాయని అంటున్నారు. అయితే గోవిందా అని ఒకర్నొకరు తోసుకుంటూ అరుస్తూ సిబ్బందితో నెట్టించుకుంటూ భక్తులు వెళ్తూ ఉంటేనే దేవుడికి కూడా ఇది సంతృప్తి చెందుతుంది. దేవుడు కూడా అహాన్ని జయించాడు.**దర్శన సిఫార్సుల కోసం , సేవా టికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరిగే వాళ్లు లేరు. రూమ్ ల కోసం ఫోన్లు చేసేవాళ్లు లేరు. తమ దర్శనం కోసం పడిగాపులు కాసేవాళ్లు లేకపోతే దేవుడికే కాదు, అధికారులకి కూడా నిద్రపట్టదు. ఇప్పుడు సుప్రభాత సేవ అవసరం లేదు, స్వామి కళ్లు తెరుచుకుని ఎదురు చూసినా దండాలు పెట్టే భక్తులు లేరు. దేవుడికి కూడా పరీక్షా కాలం వచ్చింది.*నిజానికి ఈ మధ్య జరిగినట్టు టైంస్లాట్ లో సామాన్యులకి హాయిగా దర్శనం చేయించి పంపించవచ్చు. కానీ భక్తులు కష్టపెట్టి, ఆ షెడ్లలో గంటల తరబడి కుక్క "దేవుడా" అని అరిచేట్టు చేస్తేనే అధికారులకి తృప్తి. దేవుడి ముందు రోజూ నిలబడినా వారికి ఆయన జ్ఞానాన్ని ప్రసాదించలేక పోతున్నారుప్రపంచానికి ఆర్థిక మాంద్యం భయం పుట్టినట్టు, దేవునికి కూడా భక్తులు ఇక వస్తారా అనే భయం పట్టుకుంటుంది. ఐసోలేషన్ దేవుడికి కూడా దశాబ్దాలుగా భక్తులు చూసి చూసి అలవాటు పడి ఉన్నాడు. గుడి ఖాళీగా ఉంటే భయం వేయదా? కోరికలు కోరిన వాడే లేకపోతే దేవుడిగా ఉండి ప్రయోజనం ఏంటి?*తిరుమలలో దేవుడినే నమ్ముకుని దశాబ్దాల పాటు ఎంతోమంది స్దానికులున్నారు. వారేమీ టిటిడి కొలువులో ఉద్యోగాలు కోరలేదు. వెంకన్న హుండీలో వాటాలు అడగలేదు.. అమాయకులుగా హాకర్లుగా మారి, జానెడు జాగాలో అంగళ్ళు పెట్టుకుని బొమ్మలో.. పటాలో,కుంకాలో..ఏదో చిన్న చిన్న సరుకులు అమ్మే వారు. కుడుమిస్తే పండగనుకుని ఏరోజుకారోజు "ఏక్ దిన్ కా సుల్తాన్ "లాగా బ్రతికేశారు. ఒకరోజు యాత్రికులు రాకపోతే చాలు.. వ్యాపారం జరగ లేదంటూ దిగాలు పడిపోతారు. సాయంత్రానికి పెన్ చేతపట్టుకొని కలెక్షన్ కు వచ్చే అప్పులోళ్ళకు ఏంసమాదానం చెప్పాలిరా దేవుడా.. అనుకుంటారు. అలాంటిది ఏకంగా ఇప్పటికి అన్నీ మూతపడి, కాలు కొండెక్కి నెలరోజులు దాటింది.ఎలా బతకాలి దేవుడా... అనుకుంటూ తిండికి కూడా లేని దుర్బరజీవితాన్ని చూస్తున్నారు. దూరంగా ఉండే జిల్లాలకు కోటి చొప్పున ఇచ్చిన పాలకులకు దేవుడి చెంతనే ఉండే వాళ్ళు కనీసం కనిపించలేదే? వాళ్ళకు సాయం చేద్దామనే యోచన రాలేదే హతవిధీ*ఈబాధ దేవుడి గురించి కాదు. ఆయనకేం? గొప్పోళ్ల అండతో ఎలాగో బతికేస్తాడు. ఆయన్ని నమ్ముకుని చీమలు లాంటి సన్న జనం కొన్ని వేల మంది ఉన్నారు. తిరుమలలో దేవుడు ఉచితంగా అన్నం పెట్టడమే కాదు, తిరుపతిలో కూడా ఆయన వల్ల కడుపు నిండా అన్నం తినేవాళ్లు ఉన్నారు. బస్సు దిగగానే కనిపించే ఆటోవాలా, శ్రీనివాసం దగ్గర ఐస్ క్రీం అమ్ముకునే కుర్రాడు, బండి మీద దోశలు పోసుకునే అవ్వ వీళ్లంతా ఏం కావాలి?నడక దారిలో మొదటి మెట్టు పూజ కోసం కొబ్బరి కాయ అమ్ముకునే పేదరాలు, ఆఖరి మెట్టు దగ్గర కర్పూరం అమ్ముకునే తాత దిగులు ముఖాలతో కనిపిస్తారు.నడిచి నడిచి అలసిపోతే శంఖు చక్రాల దగ్గర కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్లు, మంచాల మీద కూర్చుంటే వేడి వేడి ఇడ్లీలు ఇచ్చేవాళ్లు వీళ్లంతా ఈ పాటికి కొండ దిగే ఉంటారు. భక్తులే రాకపోతే జింకల పార్కు దగ్గర క్యారెట్ ముక్కలు జింకలకి ఎవరు అందిస్తారు? నిలువెత్తు ఆంజనేయస్వామికి దండాలు ఎవరు పెడతారు? 24 గంటలూ గోవింద నామం వినిపించే కొండ కూడా నిశ్శబ్దం అయిపోతుందా? పట్టు వస్త్రాలు, గంధపు సువాసనలు, పిల్లల ఆట వస్తువుల శబ్దాలు, టీ కొట్లలో అరుపులు, తప్పి పోయిన వాళ్ల కోసం మైకులో అనౌన్స్ మెంట్, టాక్సీ వాళ్ల కేకలు, దర్శనానికి ఎటు .పోవాలి తెలియని అనేక భాషల అర్థింపులు...ఇదంతా నిజమేనా? కొండ కూడా మౌనం వహిస్తుందా.? డబ్బుల కోసం , మెహర్భానీ కోసం ఆయన ముందు దొంగల్ని దుర్మార్గుల్ని నిలబెట్టి , హారతులు ఇచ్చి పైసా పైసా కూడబెట్టి హుండీలో వేసే పేదవాళ్లని మెడబట్టి తోసేస్తూ ఉంటే ఆయనకి కోపం వచ్చి విశ్రాంతి కోరుకున్నాడు.జనం కోరే దురాశల్ని తీర్చలేక తనకు తానే ఏకాంత శిక్షని విధించుకుంటున్నాడా? అయినా మంచీచెడు తెలియకుండా దేవుడవుతాడా? పూజలెన్ని చేసినా , కీర్తనలు ఎన్ని పాడిన, ఒక కష్ట జీవి గోవింద నామ స్మరణతో సమానమవుతుంది.నెలల బిడ్డకి దేవున్ని చూపిస్తున్న తల్లి కళ్లలోని ఆనందం , కొత్తగా పెళ్లి అయి , ఇంకా కష్టాల రంగు పులుముకోని పసుపు తాడుతో వచ్చిన అమ్మాయి కళ్లలోని జీవన సంతోషం, అంతా నువ్వే నడిపిస్తున్నావనే భ్రమ నుంచి సామాన్యుల్ని దూరం చేయకుతిరుమల మాడవీధుల్లో గజరాజులు ముందు నడుస్తూ ఉండగా కిక్కిరిసిన జనం భక్తితో ఊగుతుంటే నీ వాహనంలో మళ్లీ నువ్వు సంచరించే రోజులు తెచ్చుకో. జనం నీ కోసం ఎగబడితేనే నీకు విలువ. *కాశీదారాలు అమ్ముకునే పేదవాడు, నీ రూపంలో ఉన్న ఉంగరాలు అమ్ముకునే దీనురాలు వీళ్లందరి కళ్లలో వెలుగు లేకపోతే నీకెన్ని హారతులు ఇచ్చినా వృధానే. ఈ దేశ ప్రజలు చెట్టు పుట్ట లో కూడా దేవునికి చూసే అమాయకులు. వాళ్ల పొట్టమీద కొట్టొద్దు.* *మనుషుల్ని ప్రేమించడమే దైవత్వం.*-కోలా లక్ష్మీ పతి , తిరుపతి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం