హెహె పిట్టా ఏమిటీ సంగతులు హహా బలె బలె ముద్దు ముద్దు ముచ్చట్లేవో చెప్పవే మా అమ్మలా చిన్ని చిన్ని గమ్మత్తులా కతలే నాకు చెప్పుతావా? ఓహో హో కిచు కిచు మాబాషా నీకేమైనా అర్థమగునా? ఎక్కడ జూసినా మేమంతా కలసేమెలసే ఉంటాము. ఎగురుతు ఎగురుతు వస్తుంటే అయ్యో! వాడలల్లొ ఎవరూ కనబడతేలేరు! అయ్యో! వాకిల్లో ఇంటెనుకా పెరట్లో కాస్తింతానైనా మెతుకులైనా దొరకట్లేదే! ఏమిటీ ఈనిశ్శబ్దం అయ్యయ్యో! ఓపిట్టా మీకేమీ తెలియవా? అదేదో రోగమటా వీథుల్లో తిరుగొద్దటా ఇంట్లోనే మేము ఎంచక్క ఉంటున్నాము ఇంట్లోనే మా అమ్మనాన్నలతో ఆటలన్నీ ఆడుతున్నం అయ్యయ్యో! కాసింత అన్నమేలేదా? రోజూ మాయింటి పిట్టగోడలపైనే వాలు కిచకిచమనీ అరిచేస్తే నేనే నీకు హాయిగగా అన్నమే పెట్టేస్తా హాయిగా తినమ్మా. సరేలే రేపునీకుఓ కథచెప్పేస్తా నవ్వుపుట్టించేలా గమ్మత్తుకతలే వినిపిస్త. ఓహో బుచ్చి బుచ్చికతలే ఉన్నవి లే టా టా వచ్చేస్తా ట్రూయ్ హాయ్.--రచన నమిలకొండ జయంత్ శర్మ


కామెంట్‌లు