ఎండా కాలం సమస్యలు -4 - చర్మం ఎండ తాకిడికి నల్ల బడితే --- కొంత మందికి. ఎండలో తట్టుకునే శక్తి ఉంటుంది. మరి కొందరికి కొద్దిపాటి ఎండకి చర్మం కమిలి పోయి నల్ల రంగులోకి మారుతుంది. మనం కొన్ని వస్తువులను కలిపి మంచి మిశ్రమాన్ని తయారు చేసుకుని మన చర్మాన్ని కాపాడుకో వచ్చు. సెనగ పిండి + పాలు కలిపి ఎక్కువగా నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అందులో మెత్తని అతి మధురం పొడి +పన్నీరు +మంచి గంధం పొడి +నిమ్మ రసం ఇవన్నీ కలిపి గిల కొట్టాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ముఖం పై చేతులపై లేపనం గా పూసుకుని ఒక అరగంట తరువాత కడిగి వేయాలి. కొద్దీ రోజులలో ముఖం పై నల్లధనం విచుకు పోయి తెల్ల బడతారు. కాంతి వంతంగా ముఖం మారి పోతుంది. టొమాటో రసం కూడా ముఖం పై పూసినా తెల్ల బడుతుంది. - పి .కమలాకర్ రావు


కామెంట్‌లు