చేమంతి పూలు, ఆకులు -ఔషధ గుణాలు : - చేమంతి పూలతో పాటుగా చేమంతి ఆకులలో కూడా ఔషధ గుణాలు వున్నాయి. ఇది పాత వ్యాధులను పిత్త ,వ్యాధులను నయం చేస్తుంది. దగ్గు , జలుబు తుమ్ములు రాకుండా కూడా కాపాడుతుంది. కొన్ని పసుపు చేమంతి రిక్కలను వేరు చేసి , కొన్ని ఆకులను కాడలను కడిగి నీళ్లలో వేసి మరిగించి కొద్దిగా మిరియాల పొడి వేసి చల్లార్చి తేనే కలిపి తాగితే దగ్గు, కోరింత దగ్గు, జలుబు, తుమ్ములు తగ్గి పోతాయి . ముఖ్యంగా నరాల్లో రక్త ప్రసరణను చాలా ఉపంయొగ పడుతుంది. చామంతి పూల కాషాయం వరుసగా 40 రోజులు తాగితే వెరికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన కాళ్ళ వాపులు తగ్గి పోతాయి. బోదకాలు సమస్యకు కూడా ఇది మంచి మందు పసుపు పచ్చని చేమంతి పూల కాషాయం తాగితే కిడ్నీ లో రాళ్లు కూడా కరిగి పోతాయి. చేమంతి ఆకులు +పూలు +నువ్వుల నూనెతో తైలం రాస్తే చర్మ వ్యాధులు తగ్గి పోతాయి. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు