మృదుభాషి--ఆయనంటే కరకు మాటా ఆమడదూరంలో ఉంటుంది. కఠిన మాటలూ మెత్తబడి తీరు మార్చుకుంటాయి. మృదుభాషి. ఆయన కవితొకటి చదివి ఫోన్ ద్వారా చిరునామా తెలుసుకుని ఓరోజు ఉదయమే ఆయనింటికి బయలుదేరాను. అన్నట్టు ఆయనెవరో చెప్పలేదు కదూ...పేరు - ముకుంద రామారావు. అడిక్ మెట్ లో బస్సుకోసం చూసీ చూసీ ఎంతసేపటికీ రాకపోవడంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాను హబ్సీగూడలో ఉంటున్న ఆయనింటికి. ఓ గంటన్నరపైనే పట్టింది నడవడానికి. మాటెంత మృదువో అంతకన్నా ఎక్కువ సహృదయంతో రిసీవ్ చేసుకున్నారు ఇంటి దగ్గర. పరిచయాలయ్యాయి. అవీ ఇవీ మాట్లాడుకున్నాం. పుణుగులు పెట్టారు. మాటెంత మృదువో అంతకన్నా ఎక్కువ రుచిగా ఉన్నాయవి.ఓ అద్దం తలుపుకున్న గ్లాస్ పెయింటింగ్ ఎంత నాజుకుగా పలకరించిందో చెప్పలేను. మేడపైకి తీసుకెళ్ళి కొన్ని ఫోటోలు చూపించి చెప్పిన మాటలూ మృదుమధురమే....ఆయన చెప్తున్న మాటలు వింటుంటే ఎంత హాయిగా అన్పించాయో...మరింతసేపు ఉండాలనే అనిపించినప్పటికీ అన్ని మాటలూ ఒక్కసారే వింటే సరిపోదనుకుని సశేసంగా కొన్ని మాటలుంచుకుని బయలుదేరుతుంటే రెండు మూడు పుస్తకాలిచ్చారు. వాటిలో ఒకటి ఆకాశయానం అనే కవితా సంపుటి.అందులో ఓ చోటంటారు.... "నా పద్యం నాకంటే బలమైనది/ ఎంత దూరంలో ఉన్నా దగ్గరున్నట్టే / అందినట్టే అంది జారిపోతుంది / అందినా అధీనంలో ఉండదు" నిజం...మీ కవితలలో సున్నితత్వమూ ఉంది. గాఢతా ఉంది. ఆలోచనలో పడేసేంత బలమూ ఉన్న భావం మీది. ఏ కవితో అని చెప్పలేకపోతున్నా నా మతిమరపువల్ల. మిమ్మల్ని చూడాలనిపించేలా చేసిన ఆ కవితను గుర్తుపెట్టుకోలేకపోయిన నా మతిమరపుని ఏం చేయను? కొన్ని రోజులకు ఆయన రాసిన " విడనిముడి " అనే మరొక కవితా సంపుటిని ఈమారు మరొకరి నుంచి అందుకున్నాను.రామడుగు రాధాకృష్ణగారి నుంచి అందుకున్న ఈ విడనిముడి పేరుకు తగ్గదే. ఎక్కడో అక్కడ ముకుందరామారావుగారి మాట, నీడ వెన్నంటే ఉన్నాయి. రాధాకృష్ణగారితో మాటల్లో ముకుందరామారావుగారి ప్రస్తావన రావడంతో విడనిముడి చదవండంటూ తన దగ్గరున్న ప్రతి నాకిచ్చారు. ఈ కవితా సంపుటి "ఆత్మీయ అనుబంధాల కవిత్వం".కొప్పర్తి వారన్నట్లు "ముకుందరామారావుగారి శైలి ఓ ప్రత్యేకమైనది. ఆలోచననూ అనుభూతిని కవితలుగా సమర్పించడంలోని మీ నడక, నడత అమోఘం"ఈ అనుబంధాల కవిత్వం చదువుతుంటే మనందరి జీవితాల్లోనూ అనుభవించే ఉంటాం. ఎప్పుడో అప్పుడు బంధాలలోని ఆత్మీయానురాగాలను చవిచూసుంటాం. మనం చెప్పలేకపోయినది ఆయన అక్షరాలలో మరొక్కమారు ఆ జ్ఞాపకాలను నెమరేసుకుని తరిస్తాం. అదే ఆయన కవితలోని గొప్పతనం. ఎంతెంత దూరం (పేజీ నెంబర్ 65) అనే కవితలో ముకుందరామారావుగారిలా అంటారు..... "ఇన్నాళ్ళకు దేనికి దూరమయానో తెలిసింది అది జ్ఞాపకంగానే మిగిలిపోనీ ఇవాళ దేనికి దగ్గరవుతున్నానో తెలుస్తోంది తెలియనిదల్లా ఎంత దగ్గరన్నదే బహుశా ఎంత దగ్గరగా వచ్చినా ఎవరికీ తెలియదేమో" - అక్షరసత్యం. అన్ని బంధాలూ అవసరమే. కానీ ఒక్కొక్క బంధం ఒక్కోలాటిది. అది అనుభవిస్తేనే అర్థమయ్యేది. అది ఫలానా అని చెప్పలేం. అదంతే! ఓ రెండు మూడు సాహితీ సభల్లోనూ ముకుందరామారావుగారిని కలిసాను. మాట్లాడాను. ఆయనతో ఉన్నప్పుడు నేను ప్రేక్షకపాత్రే వహిస్తాను. అదే మంచిది కూడాను. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అతిగా మాట్లాడేస్తాను. అప్పుడు మాట గీత దాటొచ్చు. పరిచయబంధానికి ఓ గీటు పడుతుందని ఒకింత జంకే. ఎవరితోనైనాసరే అందులోనూ మీతో సున్నితత్వమే హాయి. పండువెన్నలల్లే ఉండిపోతే చాలు మన మధ్య బంధం!! మీరు "వెళ్ళాల్సినపుడు..." అన్న కవితలోని మాటతోనే ఇప్పటికిది ముగిస్తున్నాను... "వెళ్ళాలని నీకూ లేదు పంపాలని నాకూ లేదు వెళ్ళక తప్పదని తెలియనిది కాదు నిస్సహాయతలో నువ్వు నేను అయినా ఉదయం లాగ రేపటి లాగ ఎదురు చూస్తూనే ఉంటాం అద్భుతమేదో జరిగి ఆగిపోతావేమోనని" - యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం