రావణ తనయుల మరణం.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. కుంభకర్ణుని మరణవార్తవిన్న రావణుడు మూర్చపోయాడు.అనంతరం అరివీరభయంకరుడు,బ్రహ్మదేవునివరప్రసాది కుంభకర్ణుడు ఒక సామాన్యమానవునిచేతిలో మరణించడం నమ్మలేకపోతూ చింతించ సాగాడు.అదిచూసిన రావణుడి తనయులు నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశిరుడు,అతికాయుడు తమతండ్రి ఆశీర్వాదంపొంది సర్వసైన్య సమేతంగా చిత్ర విచిత్రవాహనాలతో యుద్ధరంగానికివచ్చి వానరసైన్యాన్ని హతమార్చసాగారు.అంగదునితో యుద్ధానికి దిగిన నరాంతకుడిని తనముష్టిఘూతాలతో యమపురికిపంపాడు అంగదుడు.అదిచూసిన మత్తుడుఅనేరాక్షసయోధుడుతనగజాన్నిఅంగదునిపైకినడిపాడు.ఆగజాన్నితనపిడికిలిపోటుతో నేలకూల్చాడు అంగదుడు.దేవాంతకుని చేతిలో అంగదుడుమూర్చపోవడంచూసినహనుమంతుడుదేవాంతకుడు,నీలుడు,త్రిశురుడులను ఎదుర్కొన్నారు.హనుమంతుని బాహుబలానికి తలపగిలి దేవాంతకుడు మరణించాడు.త్రిశిరుడు నిలుడు పోరాడుతూఉండగా మధ్యలోమత్తుడురావడంతోనిలుడుఇరువురితోపోరాడసాగాడు.కోలుకున్న అంగదుడు మత్తునియమపురికిపంపాడు.అక్కడ హనుమంతుని ధాటికి నెత్తురు కక్కుతూ త్రిశురుడు నెత్తురుకక్కుతూ ప్రాణాలు విడిచాడు. ప్రాణాలువిడిచారు.అదిచూసిన మహాపార్మ్వడు పెడబోబ్బలుపెడుతూ అంగదునిపైకి వచ్చాడు.అంగదుడు అప్పటికే అలసి ఉండి తూలడం గమనించిన బుషబుడుఅనే వానరయోధుడు మహాపార్మ్వనితో తలపడిభీకరసమరంచేసిఅతన్నిచంపాడు.వానరసేనలు విజయధ్వానాలు చేస్తూ రాక్షససేనలను తరుమసాగియి.అదిచూసిన అతికాయుడు సింహనాధం చేస్తూ భయంకరంగా యుధ్ధరంగంలో వానరసేనలను వధించసాగాడు.లక్ష్మణుణు శ్రీరాముని ఆశిస్సులుపొంది అతికాయునితో తలపడి పలుదివ్యఅస్త్రాలు ప్రయోగించాడు వాటి అన్నింటిని తనశరాలచే నిలువరించిన అతికాయుడు"నీవు చిన్నవాడవు నాతోసమఉజ్జికాదు పో,మీఅన్నశ్రీరాముని రమ్మను"అన్నాడు. కోపించిన లక్ష్మణుడు ఓఅస్త్రంతో అతికాయుని నుదుడిపై గాయాన్ని చేసాడు. తనధనస్సు సంధించిన అతికాయుడు లక్ష్మణుని వక్షస్ధలంపై గాయంచేసాడు.కోపించిన లక్ష్మణుడు బ్రహ్మస్త్రాన్ని మంత్రించి అతికాయునిపై ప్రయోగించగా అది అతనితనఖండించింది.(ఈఅతికాయుడు రావణునికి ధాన్యమాలి లకుజన్మించాడు) వానరసేనలజయధ్వానాలతో యుధ్ధరంగం దద్దరిల్లింది.రాక్షససేనలు పలాయనం చేసాయి.


కామెంట్‌లు