నాన్న(బాలగేయం) బుంగమూతి పెట్టి నేను అలిగాను మూలకున్న గుంజ పక్క నక్కాను. వెక్కి వెక్కి ఏడుస్తు ఉన్నాను ఇంతలోన నాన్న వచ్చి చూసారు. ఏమైంది బంగారం అన్నారు సైకిలేది నాకంటు అడిగాను దీనికేన చిన్నోడ అలిగావు బయటికెళ్ళి కొందాము అన్నారు బుజ్జగించి తీసుకుని వెళ్లారు కొత్త సైకిలిచ్చి నన్ను చూసారు ప్రేమతోటి తలమీద నిమిరారు నువ్వేరా నా ప్రాణం అన్నారు. ....పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు