క్రిమి భరతం పట్టరా (గేయకవిత) ఇది మాయదారి జబ్బురా మహమ్మారి జబ్బురా మందు లేని సందు చూసి మహిని ఆక్రమించెరా కరోనాగ పుట్టెనురా కాలనాగు అయ్యెనురా కంటికి కనిపించకుండ కాటు వేయ చూచునురా మతమేదో చూడదురా ప్రాంతమేదో కనదురా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చేయ చూచునురా అభివృద్ధిని ఆపునురా అయోమయం చేయునురా శ్రమ సంపద సృష్టి నాపి పేదరికం పెంచునురా కళ్ళు లేని రక్కసిరా దారి లోని కాయునురా ఎవరు అటుగ వచ్చినను వారి మీద పడునురా సూక్ష్మ రూపు కలదిరా అతిగ బాధ పెట్టునురా కట్టడి చెయ్యక పోతే కల్లోలం చేయునురా ఆరోగ్యం ముఖ్యంరా ఆదాయం కాదురా బతికుంటే ఆదాయం తిరిగి పొంద వచ్చురా ప్రాణాలే మిన్నవిరా పోకిరిగా తిరగకురా మందు లేని ఆ జబ్బుకు ఇల్లే కడు పదిలంరా ఉదాసీన మొద్దురా ఉపద్రవం కోరకురా లాక్ డౌన్ కి సహకరించి ప్రాణం కాపాడుకొనురా బెలగాం భీమేశ్వరరావు


కామెంట్‌లు