బొమ్మ ******************** కొమురెల్లి జాతరకు నేను వెళ్ళాను జాతరలో నేనొక్క బొమ్మ కొన్నాను బొమ్మకెంతొ అందమైన చీర కట్టాను చీరలోన ఆ బొమ్మ ముద్దుగున్నాది నగలెన్నో తెచ్చివేసి మురిసిపోయాను ఎత్తుకోని ఊరంత తిప్పి వచ్చాను పిల్లలంత వచ్చి చూసి ఇవ్వమన్నారు ఇవ్వనంటె ఇవ్వనంటు పారిపోయాను ఇంటికెళ్ళి దిష్టి తీసి లాల పోసాను బజ్జోపెట్టి జోలపాట నేను పాడాను. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు