నిజమే కదూ...---ఈ మధ్య నాకెంతో ఇష్టమైన తమిళ రచయిత్రి ప్రసంగం ఒకటి విన్నాను. ఆవిడో మాట చెప్పారు. అదెంతో ఆలోచనలో పడేసింది. బాగా ఆలోచిస్తే నిజమే అన్పించిందికూడా. ఇంతకూ అదేంటంటే, మనకిష్టమైన వారిని ఫోటోలు అడిగి వాట్సప్ లో పంపమని అడుగుతుంటాం. అయితే అందరిలో కొందరే ఫోటోలు ఇస్తారు. కొందరివ్వరసలు. వారికి మన మీద నమ్మకం లేకపోవచ్చు లేక ఫోటోలో ఏముంది నీకు నన్ను తెలుసు - నాకు నిన్ను తెలుసు అంటారు. అటువంటప్పుడు ఫోటోలతో పనేమిటీ అనిపిస్తుంది. అయినా ఇష్టమైన వారు కొందరు అడక్కుండా వాళ్ళంతట వాళ్ళే ఫోటోలు షేర్ చేస్తారు వాట్సప్లో. అవి అందడంతోనే.పట్టరాని ఆనందంతో థాంక్స్ చెప్తాం. ఇక ఫేస్ బుక్కులో అయితే వేరే చెప్పక్కర్లేదు. ఫోటో ఎలాటిదైనా కావచ్చు. బాగుందా బాగులేదా అనే.దాంతో పని లేకుండా లైకులు కొట్టడం ఐ లవ్ యు చెప్పడం లవ్ సింబల్స్ తో థాంక్స్ చెప్పడం వీలుంటే కామెంట్లు చేయడం. అదలా ఉండనిస్తే వాట్సప్ లో ఫోటో పంపగానే సేవ్ చసుకోవడం ఒకటి రెండు సార్లు చూసుకోవడం మామూలే. అయితే సెల్ ఫోన్ మొత్తం ఫోటోలతో నిండోపోయి ఓవర్ లోడ్ అయితే ఏమాత్రం ముందు వెనకలు ఆలోచించక చూడకుండా మొత్తాన్ని ఒక్క దెబ్బతో డెలీట్ చేసి పారేస్తాం. ఫోటో తెప్పించుకునే దాక నువ్వు లేకపోతే నేను లేనని ఎమోషన్స్ తో ఏవేవో మాటలనేస్తాం. తీరా ఫోన్లో లోడ్ ఎక్కువైనప్పుడు ఆ ప్రేమా అభిమానమూ అడగడొలు వంటివన్నీ ఎటు పోతాయో పోతాయి. కనుక నేను ఫోటోలు షేర్ చేయడానికో పంపడానికో పెద్దగా ఆసక్తి చూపనని ఆ తమిళ రచయిత్రి చెప్పడం నూటికి నూరు శాతం నిజమే అనిపిస్తోంంది. అభిమానమో ప్రేమో ఎదలో ఉంటే చాలదా? మళ్ళీ ప్రశ్నించడం ఎందుకు....సరిపోతుంది ఎదలో ఇష్టమైన వాళ్ళుంటే....- యామిజాల జగదీశ్


కామెంట్‌లు