బతికి బట్టకట్టరా(గేయకవిత) ఇది మాయదారి జబ్బురా మనసు లేని జబ్బురా మందులేని సందు చూసి మహిని ఆక్రమించెనురా కరోనాగ పుట్టెనురా కాలనాగు అయ్యెనురా కంటికి కనిపించకుండ కాటువేస్తోందిరా మతమేదో చూడదురా జాతేదో చూడదురా మనుషులు కనిపిస్తె చాలు చావు చేయి చాపునురా దేశమేదొ చూడదురా ప్రాంతమేదొ కానదురా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చేయ చూచునురా అభివృద్ధిని ఆపునురా అయోమయం చేయునురా సంపాదన సృష్టి నాపి పేదరికం పెంచునురా కళ్ళు లేని రక్కసిరా కలిమి లేములు కనదురా ఉసురు నిలుపు ఊపిరిని కర్కసముగ నలుపునురా అతి సూక్ష్మ రూపు కలదిరా అతిగ బాధ పెట్టునురా కట్టడి చెయ్యకపోతే కల్లోలం వచ్చునురా ఆరోగ్యం ముఖ్యంరా ఆదాయం చూడకురా బతికుంటే ఆదాయం తిరిగి పొందగలంరా ప్రాణాలే మిన్నవిరా ప్రాముఖ్యత నివ్వరా మందు లేని ఆ జబ్బుకు ఇల్లే కడు పదిలమురా బయట తిరగ వద్దురా క్రిమిని చేర వద్దురా గడప దాటకుంటేను క్రిములు మనను చేరవురా ఉదాసీన మొద్దురా ఉపద్రవం కోరకురా లాక్ డౌన్ కి సహకరించి బతికి బట్ట కట్టరా బెలగాం భీమేశ్వరరావు పార్వతీపురం


కామెంట్‌లు