అమ్మమ్మ **************** (బాలగేయం) అమ్మమ్మంటే అమ్మమ్మ ఆనందాల మా బామ్మ ఇపుడే ఇంటికి వచ్చింది అప్పలు ఎన్నో తెచ్చింది అడిగిందల్లా ఇస్తుంది అల్లరి వద్దని అంటుంది ఎన్నో కథలను చెబుతుంది ఎర్రని మిఠాయి చేస్తుంది ముచ్చటనంతా వింటుంది ముత్యం నీవని అంటుంది గోరుముద్దలు పెడుతుంది గోకుల కృష్ణా!అంటుంది. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు