బొప్పాయి పండు , ఆకులు ఔషధ గుణాలు : -బొప్పాయి పండుతో పాటుగా దీని ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి ఆకులను కడిగి మిక్సీలో వేసి ముద్దగా చేసి నీరు పోసి అల్లం ముక్కలను వేసి కాషాయం చేసి తాగితే అన్ని రకాల జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ , చికెన్ గున్యా మలేరియా జ్వరాలు తాగ్గి పోతాయి బొప్పాయి ఆకులు + కొబ్బరి నూనెతో తైలంగా కాచి చల్లార్చి చర్మం పై రాస్తే చిన్న, చిన్న పుళ్ళు తగ్గి పోతాయి. బొప్పాయి పండు తింటే రక్తం లో ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. చక్కర వ్యాధి పెరగకుండా కాపాడుతుంది. పచ్చి బొప్పాయి కాయకు గాట్లు పెడితే చుక్కలు , చుక్కలుగా పాలు కారుతాయి స్పూను ఆముదం లో పది బొప్పాయి పాల చుక్కలు కలిపి కడుపులోకి తీసుకుంటే క్రిములు పోతాయి. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు