పల్లెటూరు ******************* (బాలగేయం) పచ్చనైన పంటల్లో పట్టుకుచ్చులు పారేటి ఏరుల్లో కొంగ భామలు ఇంటింట వనమంటి పూలమొక్కలు మిన్నంటే అల్లరితో చిన్ని పాపలు ఎగిరేటి పక్షులతో చెట్టుకొమ్మలు ఎడ్లబండి నాగలితో రైతన్నలు ముంగిట్లో ముచ్చట్ల పలకరింతలు ముద్దబంతి నవ్వుల్లో వెలుగు దివ్వెలు పిల్లగాలి తెమ్మెరల పులకరింతలు పల్లెటూరి అందాలే పసిడి కాంతులు. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు