మననం చేసుకునేందుకు కాలం ఒక నోస్టాల్జియానే.. .... ఇప్పటికీ ఆ బడిలో అడుగుపెడితే ఉద్వేగపు గుర్తులు కూర్చున్న బెంచీ..భవిష్యత్తును నిర్దేశించిన బ్లాక్ బోర్డు బతుకు రాతను తెలిపిన చాక్ పీస్ "గురు"తర బాధ్యతను నెరవేర్చిన చేతులు.. ఆడిన ఆటలు పాడిన పాటలు వల్లె వేసిన పద్యాలు ఆకలింపు చేసుకున్న గద్యాలు చెప్పుకొన్న ముచ్చట్లు బాధ, భయం, దు:,ఖం, సంతోషం ఇన్నీ బట్వాడా అయింది ఆ నేస్తాలతోనే గుండె తడిని మీటిన ప్రతీ సందర్భం ఒక్కో నవోన్మేషం.. తవ్వకాల్లో ఒక్కో జ్నాపకం బయట పడుతుంటే నయన ద్వయం అలా కన్నీరులొలుకుతూనే ఉంది ఇన్నింటికి సాక్షంగా పెద్దబడి కనిపిస్తూనే ఉంది ఎన్ని తరాలను చూసింది ఎంతోమందికి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చింది ఇంకా ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే అది పెద్దబడి.. ... ఎనబోతుల భాస్కర్


కామెంట్‌లు