క్రమ శిక్షణే నేర్పే పసి బాలురకును కరోన రక్కసి కోరల పడక బాల్యమే భయ మెల్లవీడె నహో వింతలే. చతుస్ర గడులే ఆటల కవి వినోదమాయే వసివాడని పసిహృదయాల క్రీడా వేదికలై అమరే. అలుపు సొలుపు లేక బాల్యమెంత శ్రమైన ఓర్చుకొనుటకే అలవాటు పడే ఆ దృశ్యం చూస్తే బలే బలే గలగల నగవుల నాట్యమాడిపించు. బాధల బానిసలకోర్వలేని ఓమనిషీ! ఆపసితనపు చేష్టలనొకసారి చూడుమా! ఏచీకు చింతలేక రెక్కలొచ్చిన పక్షులవోలే మనసెంత సర్దుకొన్నదో ఆ చిన్న గుండె నడిగి తెలుసుకో మంచితనాన మానాన గడపడమెలానో మసలుకో. బానిసతనమే వీడి సోమరితనమే ఆవలపడవేయు నీలోనా ఆ పసితనపు పరువమే మెరుపులా వెలకాంతులే విరిసీ వెన్న మనసులా మార్చివేయును.రచన. నమిలకొండ జయంత్ శర్మ


కామెంట్‌లు