మల్లె ఆకులు - ఔషధ గుణాలు : మల్లె పూలు సువాసనలను వెదజల్లుతూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా తయారు చేస్తాయి. మల్లె మల్లె ఆకులలో కూడా ఔషధ గుణాలు దాగి వున్నాయి. కొన్ని మల్లె ఆకులను కడిగి నీరు పోసి మరిగించి చల్లార్చిన నీటితో పుక్కిలిస్తే నోటి పుళ్ళు తగ్గిపోతాయి. చిగుళ్ల వాపు తగ్గి పోతుంది. మల్లె ఆకుల రసం +నువ్వుల నూనెతో తైలంగా కాచి చల్లార్చి చెవిలో వేస్తె చవి పోటు తగ్గి పోతుంది. చెవి నుంచి చీము కారడం కూడా తగ్గి పోతుంది. మల్లె ఆకులను మరిగించి చల్లార్చిన కాషాయం తాగిస్తే కడుపులోని క్రిములు బయటకు వస్తాయి . మల్లె ఆకుల రసం +పసుపు + ఆముదం తో తైలంగా కాచి ఆనెల ఫై రాస్తుంటే కొద్దీ రోజుల్లో వాపు తగ్గి ఆనెలు మాయమై పోతాయి కాళ్లలో పగుళ్లు ఈ తైలం రాస్తే తగ్గి నున్న బడతాయి -పి . కమలాకర్ రావు


కామెంట్‌లు