అతిథి (బాలగేయం) ఇంటికి అతిథి వచ్చారు నమస్సులంటూ చెప్పాను కాళ్ళకు నీళ్ళు ఇచ్చాను చేతి కండువా తెచ్చాను లోనికి రండని పిలిచాను కూర్చోండంటూ చెప్పాను పీటను వేసి ఉంచాను తాగే నీళ్ళు ఇచ్చాను. అమ్మానాన్న వచ్చారు ఎన్నో కబుర్లు చెప్పారు వంటలు ఎన్నో వండాము అతిథికి వడ్డన చేసాము చుట్టూ కూర్చొని ఉన్నాము విషయాలెన్నో అడిగాము ఎంతో ముచ్చట పడ్డారు శుభమస్తంటూ వెళ్లారు పద్మ త్రిపురారి జనగామ


కామెంట్‌లు