కరోనా -------- కరోనా వచ్చెను . కష్టం తెచ్చెను .. కాలాన్ని చేదుగా మార్చెను ... కన్నీళ్ళన్ని నేల చేర్చెను .... కరువు చేసే అన్నిటిని కరుణలేని కరోనా ..... కళకళ లాడే ప్రపంచంలో కల పోయి కలవరమే మొదలాయే ! ప్రపంచమే చిన్నబోయే !! ప్రపంచమే చీకటిగా మారిపోయే ... ఘోరమైనా కరోనా నీ వలలో పడినోల్లంతా నీరులేని చేపలవలే విలవిలలాడిపోతూ ! శవాలై ఆకులవలే రాలిపోతూ !! కుప్పలు కుప్పలుగా కూలిపోతూ .. దిక్కులేని శవాలుగా మిగిలిపోతూ ... మిగిలినా ప్రజలంతా కుమిలిపోతూ .... ఇంటికే అంకితమైపోతూ ! నిశ్శబ్దంతో జాగ్రత్తలతో యుద్దమే చేస్తుండెను నిన్ను అంతం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా ఏకమై .... /వంగ శ్రావణ్ కుమార్/ / మల్లారం /


కామెంట్‌లు