పూలదండ ****************** (బాలగేయం) మా యింటి తోటలో పూలతీగలు వాటిపైన వాలేటి రంగు చిలకలు పిల్లగాలి తెమ్మెరకు చిన్ని పువ్వులు నవ్వులతో నాట్యమాడె పూబాలలు జాజిమల్లి మందారం బంతిపువ్వులు కనకాంబర కాంతుల్లో వెలుగు దివ్వెలు ఎర్రనైన గులాబీ చామంతులు లిల్లిపూల సొగసులతో సంపెంగలు రంగురంగుల పూలు చూసి మురిసిపోతిని పూలన్ని తెచ్చి నేను మాలకడితిని అందమైన పూలదండ కన్నయ్యకు ఆనందం వెల్లివిరిసె నా మనసుకు. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు