అమ్మ --- (బాలగేయం) ప్రేమకు రూపం మా అమ్మ అనురాగ దీపం మా అమ్మ ఎన్నో సేవలు చేస్తుంది అల్లారు ముద్దుగ చూస్తుంది తీరొక్క వంటలు చేస్తుంది తీరైన మాటలు చెబుతుంది. పలకా బలపం ఇస్తుంది బడికే పదమని అంటుంది చదివీ ఎదగాలంటుంది చదువుల సారం చెబుతుంది. పద్మ త్రిపురారి.


కామెంట్‌లు