అనుష్టుప్ అంటే ఇలా ----------------------------- దాదాపు నాలుగు దశాబ్దాల పాటు "కృష్ణా పత్రిక" సంపాదకుడిగా తెలుగుపాఠకులను చైతన్య పరచిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు రఘుపతి వెంకటరత్నంనాయుడిగారి శిష్యులు. ఆయన సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలన వంటి ఉద్యమాలు కృష్ణారావు గారిని ఎంతగానో ప్రభావితం చేశాయి. బ్రహ్మసమాజంలో ధార్మిక ఉపన్యాసాలు ఇస్తూ వచ్చిన కృష్ణారావుగారిని ఒక సభలో సంస్కృతం పరిచయం లేని కొందరు "అనుష్టుప్" శ్లోకం అంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణారావుగారు "ఒక పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి. ఇలా నాలుగు పాదాలలో మొత్తం ముప్పై రెండు అక్షరాలు ఉంటాయని ఉదాహరణగా ఓ పద్యం చెప్పారు. "ఒక కాని ఒకే కాని రెండు కానులు అర్ధణా మూడు కానులు ముక్కానీ నాల్గు కానులు ఒక్కణా" సేకరణ - యామిజాల జగదీశ్


కామెంట్‌లు