పరిస్కారం (కథ),-బోగా పురుషోత్తం, తుంబూరు. --- కైలాసనాధస్వామి కోనలో కైలాసం అనే సాధువు ఉండేవాడు. అయన ఎందరో నిరుపేదలకు అన్నదానం చేస్తూ ఆకలి తీర్చుతూ ఆనందంగా గడిపేవాడు. సమస్యలతో తన వద్దకు వచ్చే ఎందరికో పరిస్కారం చెప్పి సమస్యల చెరసాల నుంచి విముక్తుడ్ని చేసేవాడు. దీంతో కైలాసం పేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. అయితే తమ వద్దకు వచ్చే వారు ఎలాంటి కానుకలు ఇచ్చినా స్వీకరించకుండా వారికీ నిస్వార్ధ సేవలు అందించే వాడు. ఓ సారి అతని వద్దకు పెద్ద గజ దొంగ ఒకడు వచ్చాడు. అతడు పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు వచ్చిన అతను "స్వామీ నేను పూర్తీగా మారిపోయాను.. నన్ను నమ్మండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. నువ్వు, నేను అందరం ఏదో ఒక రోజు పోవాల్సినవారమే.. అందుకే భగవంతుడ్ని నమ్ముకోవడం మంచిది.. " అని వేదాంతం మాట్లాడడంతో కైలాసం చేరదీసాడు. . కొన్ని రోజులు నమ్మకంగానే మెలగుతూనే సాధువు తనవద్దే శాశ్వతంగా ఉండిపోయేoదుకు ఆశ్రయమిచ్చాడు. ఓ సంవత్సరం ఉత్తముడిగా మెలగుతూ ఆ ఆశ్రమంలో అన్నీ వ్యవహారాలు చూడసాగాడు. ఓ సారి యాభై వేల రూపాయలు తీసుకుని మార్కెట్ కు సరుకుల కోసం బయలుదేరాడు. అక్కడ దుకాణంలో తన వద్ద ఉంచుకున్న నకిలీ నోట్లను 50 వేలు నోట్ల కట్టలో ఉంచి అందుకు సరిపడ నోట్లను తన జేబులో భద్రంగా దాచుకున్నాడు. కైలాసం ఆశ్రమానికి ఎన్నో రోజుల నుండి ఆ దుకాణం యజమాని నిత్యసరసరుకులను సరఫరా చేస్తున్నాడు. ఆ నమ్మకంతో ఆ వ్యక్తి ఇచ్చిన నోట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించకుండా తీసుకుని సరుకులు ఇచ్చాడు. ఆ సరుకులు తీసుకుని ఆశ్రమానికి బయలుదేరాడు . దారి మధ్యలో మరో కూల్ డ్రింక్ షాపుల్లో సైతం రెండు వేల రూపాయల నకిలీ నోటు ఇచ్చి కైలాసం స్వామికి అని చెప్పి రెండువేల రూపాయల శీతల పానీయాల కొన్నాడు. ఆ కొట్టు యజమాని స్వామీజీపై నమ్మకంతో ఆ నోట్లు తీసుకుని కూల్ డ్రింకులు ఇచ్చారు. ఆ కూల్ డ్రింకులు తీసుకుని ఆశ్రమంలో పెట్టి ఓ ముఖ్యమైన పని ఉందని చెప్పి బయటకు వెళ్లాడు ఆ వ్య క్తి . రెండు రోజులు ఆ ఆశ్రమం ముఖం కూడా చూడలేదు. కైలాసం స్వామికి ఆ వ్యక్తి ఫై ఏదో అనుమానం కలిగింది. ఏ ముప్పు వస్తుందో అని భయపడసాగాడు. ఓ రోజు అర్ధ రాత్రి కైలాసం స్వామి నిద్రిస్తున్న వేళ పదిమంది పోలీసులు వచ్చి స్వామిని జీపులో ఎక్కించుకుని వెళ్లారు. జైలులో బంధించారు. స్వామీజీకి దిక్కులు తెలియలేదు. " ఏమిటీ ? ఎందుకు నన్నిలా బంధించారు...?" పోలీసులు ప్రశ్నించాడు. పోలీసులు అతనిపై ఆగ్రహంతో చూశారు. " దొంగ స్వామి.. దొంగ నోట్లు ముద్రించి ఇలా ఎంత కాలం మార్చు తున్నావు..ఎందరిని మోసం చేశావో చెప్పు..?" అని నిలదీశారు. "దొంగనోట్లా... అసలు అదేమీ నాకు తెలియదు...." అమాయకంగా చూశాడు స్వామిజీ. పోలీసులు మరింత కోపంతో "తెలియదా.. నీకు ?ఏమీ తెలియదా? ఏమీ తెలియకుండానే ఎలా ఎంత కాలం మార్చుతున్నావు.. చెప్పు..?" అంటూ నాల్గు లాఠీ దెబ్బలు తగిలించారు పోలీసులు. ఆ తరువాత ఆ దుకాణం యజమాని వచ్చి తనవద్ద స్వామిజీ మనిషి దొంగ నోట్లను మార్చిన సంగతిని వివరించాడు. అది విన్న కైలాసం స్వామి గజ దొంగ చేసిన పనికి తాను అప్రత్రిష్ట పాలయ్యానని గ్రహించాడు. తాను తనకేమీ తెలియదని నెత్తి నోరు కొట్టుకున్నా పోలీసులు వినలేదు. నిజం గ్రహించలేకపోయారు. ఆ గజ దొంగను కూడా తీసుకొచ్చి అతను చేసిన దొంగతనాలతో స్వామిజీ కి కూడా కొంత సంబంధం వుందని సృష్టించి పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. తనకు ఎలాంటివేమీ తెలియదని దైవంమీద ప్రమాణం చేసి చెబుతున్నానని మొరపెట్టుకున్నా కోర్టు ఆలకించలేదు. చివరకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కైలాసం స్వామి నిజాయతీగా వున్నా దుష్టుడి వల్ల ఆపదలో చిక్కుకున్నాడు. అందరి సమస్యలకు దైవ నామ సంకీర్త నే గొప్ప ఔ షధమని చిట్కాలు చెప్పే స్వామికి ఇప్పుడు తన సమస్యకు పరిస్కారం దొరకలేదు. భగవన్నామ సంకీర్తన ఓ క్కటే మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని బోధించే తనకు ఇప్పుడు తన బోధనలే తనకు పరిస్కారమార్గ మైoది.


కామెంట్‌లు