తాటి ముంజలు ఔషధంగా : తాటి చెట్టు పై గుత్తులు గుత్తులుగా మనకు తాటి కాయలు కనబడతాయి . తాటికాయ లోపలి భాగం తీయని గుజ్జుతో కూడిన తీయని రసంతో ఉండేవే తాటి ముంజలు . లేత తాటి ముంజలు తినడానికి రుచిగా ఉంటాయి. శరీరానికి ఎండా కాలం లో చల్లదనాన్ని ఇచ్చి సేద తీరుస్తాయి. లేత ముంజలను మిక్సీలో వేసి పేస్టుగా చేసి అందులో కొద్దిగా పెరుగు వేసి నీరు పోసి తాగితే కడుపులో నొప్పి తగ్గి పోతుంది. లేత ముంజ కాయ గుజ్జులో యాలకుల పొడి +తాటి కలకండ +నీరు కలిపి తాగితే మూత్రంలో రక్తం పడటం తగ్గిపోయి మూత్రం ఫ్రీ గా వస్తుంది.. లేత తాటి ఆకులను వాసపులపై కట్టుకుంటే వాపులు తగ్గి పోతాయి. - పి .కమలాకర్ రావు


కామెంట్‌లు