. ప్రేమదే రంగు???పెనుగొండ sarasija కరీంనగర్ వాళ్లకేం కోరికలుంటాయి ఆకలి ప్రేగులను తడిమే అమ్మ ప్రేమ తప్ప వాళ్ళకేం ఆశలుంటాయి రోజుకో క్షణమైనా వెంట నడిచే నాన్న పిలుపు తప్ప ఆకాశాని కద్దిన తారలు వాళ్ళు రాలిపోకుండా చూడు మీ కళ్ళలో కోటి కాంతులు మెరిపిస్తారు నింగిన విహరించే మేఘాలు వాళ్ళు కాస్త స్పర్శించండి. ప్రేమ జల్లులై మీ మనసుల్ని ముద్దు చేస్తారు. సాగరంలో సంఘర్షించే అలలు వాళ్ళు ఎప్పుడన్నా తాకి చూడు తీరమంతా ఆరని వారి కన్నీళ్లతో తడిసే ఉంటుంది. నువ్వు నేను ఎన్నాళ్లుంటాం? ఈ లోకం వారిది కాదూ! వాళ్లు లేని లోకమెందుకు? వాళ్లని దిక్కులేని వాళ్ళని చేసిన దేశం దిక్కుమాలినదైపోదూ! అప్పుడప్పుడు వాళ్ళూ కలకంటారు ఆకాశ పిట్టల గుంపు వరుసలో అమ్మ కొంగు ను చూసి కోరికతో ఎగిరి దోబూచులాడాలని... అప్పుడప్పుడు రాలే నక్షత్రాల్లో నాన్న నవ్వుల్ని ఒడిసిపట్టి తమ ఒళ్ళంతా అద్దు కోవాలని... అడిగి చూడు! వాళ్ళూ భయపడతారు ఏ పీడకల కో కలత చెంది అమ్మ అరచేతిలో పిడికిలి పెట్టుకోవాలని.. ఎప్పుడన్నా పక్కకు ఒత్తి గిల్లితే పక్కనున్న నాన్నను గట్టిగా హత్తుకోవాలని! తడిమి చూడు! ఏ భావానికి చిహ్నమో ఏ రంగో తెలియని వారి అమాయకపు చిరునవ్వు ప్రేమదేరంగని?? ప్రశ్నిస్తోంది! ఏం తప్పంటావా?? వాళ్లకీ హక్కులుంటాయి. నీకేం హక్కుందని వాళ్లని సృష్టించావు. జన్మనివ్వడం మాత్రమే నీ హక్కయితే ఇంకెప్పుడూ ప్రేమించో,కామించో, వారినీ మిథ్యా ప్రపంచం లో ప్రశ్నగా మిగల్చకు ఆలోచించి చూడు!


కామెంట్‌లు