బిగ్ బాస్ షో ఎప్పుడన్న ఇసారిచ్చుకున్నామా కలలోనైనా ఊహించామా ఓడలు బండ్లయితయని విన్నము మరి ఇప్పుడయితే నిజమే ననిపిత్తుంది అన్ లైన్ చదువులంట ఇంటినుంచే ఉద్యోగము చేస్తూ కంప్యూటర్ తో తికమకల యాంత్రికత ఎవ్వడిని పలుకరించిన మొఖాన ఇంత జీవకళ ఉట్టిపడ్తలేదు భయం భయంగా బిక్కు బిక్కుమంటుండ్రి అప్యాయతల ఆలింగనమే కరువైంది దగ్గరకు పోతేనే పరుగులంకితుండ్రి పాపం వాళ్ళ తప్పేముందులే పత్తాలాడితే పాతికమందికి ఆష్టచమ్మడాతే అరవై మందికి కరోనా చుట్టుకుని క్వారెంటైన్ లో చేరిరి మరి ఇంత భయం లేకుంటేట్లా ఇంట్లో కలిసిపోయి కలివిడి చేసినా ఎదో ఓ మూలన ఆయసమౌతనేవుంది ఇంటిల్లిపాదికి మొఖంపైననే నవ్వులే వారం, పది, పాతిక సరిపెడ్తారు నెలలు గడిచిన ఒకరి మొఖం ఒకరు చూసుకొనుడంటే ఎప్పుడు ముగుస్తుందో తెలియని దుస్థితి బతుకు పాడిందే పాడి, ఆడిందే ఆడినంటుంది చుట్టం సూపు లేదు దావత్ ముచ్చటలేదు తప్పిదారి తెలిసినాయన ఇంట్లోకోస్తే చాయ టిఫిన్ల ఊసే లేదు అర్థం చేసుకోని ఆయన ఆవల పోయాక కూసున్న కుర్చి కడిగి, సానిటేషన్ కొట్టవడ్తిమి ఒకప్పుడు శత్రవున్నాడా అంటుంటిమి ప్రస్తుతం కనిపించిన ప్రతోక్కరిని శత్రువులా చూడవడ్తిమి ఇల్లిల్లు తిరిగి అడుక్కునేటోళ్ళు కూడ అర్థం చేసుకొని అడగడమే బందుసేసిండ్రు పశువులు, కుక్కలు, గువ్వలన్ని మనల చూడ ఇంటికొచ్చి పిలుస్తున్నయి మనిషిపైన ఎండవాన తగిలితేనే బాగుంటడు నేడు అందరి జీవితాలు బిగ్ బాస్ షో ఐంది అందులో ఎలిమినేషన్ వుంది ఇక్కడందరూ పోటిదారులే అందులో గెలిస్తే డబ్బులోచ్చి, కీర్తి పోందుతరు కానీక్కడ ఇంటుంటే జీవితాన్నే పొందుతాము ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు