వైద్యో...నారాయణో..హరి.-- --అవును ఇప్పుడు దేవుళ్లంటే.. కనబడని వైరస్ తో యుద్ధం చేస్తున్న వైద్యులే..! ఆరిపోతున్న దీపాలకు అరచేతులు అడ్డమ్ పెడుతున్న వీర సైనికులు వీళ్ళే.. మందూ ..మాకూ లేని మహమ్మారికి ఎదురెల్లడమంటే మాటలు కాదు. మృత్యువు నోట్లో తలపెట్టి మనల ఈవలకు లాగెయ్యడమే.. నిండా ముసుగులతో.. యముడికే ఎదురెల్లుతున్న ఈ వైద్యులకు ప్రణమిళ్ళాల్సిందే..! తెగిన గాలిపటాలని తిరిగి అతుకుతున్న వైద్యనారాయణులు వీరే.. ప్రాణాంతకమని తెలిసీ ప్రాణాలు కాపాడ పాకులాడుతున్న రోబోలు.. అరగంట మాస్కులకే ఉక్కిరి బిక్కిరయ్యే మనం అహోరాత్రుళ్ళూ క్వారన్ టైన్లో బందీలై శత్రువుతో..పోరాటం.. వైరస్ భూతం ఉందేమోనని బస్సు ఊచలకే భయపడిపోతున్న మనం.. మహమ్మారి కరోనాతో వీళ్ల కదనం మాటలు కాదు.. ఇప్పుడు ఆలయాలకు ఆలయాలే అదిరి మూతలు పడ్డయి ఈ వైద్యులు మాత్రం మనింటికే వస్తారట.. రక్షించేందుకు.. వైరస్ పుట్టిన ఆ ఊహాన్ కోలుకుంటూంది ఇప్పుడిప్పుడే అది వీళ్ళ రెక్కల మీంచే..కదా! కదలక మెదలక కొలువై ఉన్న ఆ శిలా ప్రతిమలకన్నా.. ఈ వైద్య నారాయణులకే..నా ప్రణామాలు..! --నాంపల్లి సుజాtha


కామెంట్‌లు