జ్ఞాపక శక్తిని పెంచే మందు : - పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా పోషకాహార లోపం ఉండ కూడదు సరస్వతి ఆకు (బ్రహ్మి ) పొడి +వస కొమ్ముల పొడి + పిప్పళ్ల పొడి అన్నింటిలో నీరు పోసి మరిగించి అందులో తాటి కలకండ లేక బెల్లం వేసి చల్లార్చి అందులో పాలు కూడా కలిపి తాగాలి. ఇది తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రెండు స్పూన్ల సోంపు తీసుకుని నీటిలో వేసి తాటి కలకండ వేసి మరిగించి చల్లార్చి పాలు కలిపి తాగాలి. జ్ఞాపక శక్తికి సోంపు బాగా పని చేస్తుంది. కాబట్టి ఇది రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది కొద్దిగా మిరియాల పొడి లో తేనే కలిపి నాకితే . జ్ఞాపక శక్తి తగ్గదు . చురుకుదనం పెరుగుతుంది.-పి . కమలాకర్ రావు


కామెంట్‌లు