స్ఫూర్తి"-- విద్యార్థులు పరీక్ష రాస్తూ, ప్రశ్నా పత్రాలలో లీనమై ఉండగా పదకొండు గంటలకు అకస్మాత్తుగా వచ్చింది విద్య.కాలేజీ నియమాల ప్రకారం పరీక్ష రాయడం కుదరదు వెళ్లిపోవాలంటూ వారించారు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు.ఆలస్యముగా రావడానికి కారణం వివరించబోతుండగా అడ్దుకుని, "నా చేతిలో ఏమి లేదు విద్య , కారణమేదైనా ఇక్కడ నేను ఒక ఉద్యోగిని మాత్రమే.నియమాలను అతిక్రమించలేను, ప్రధానోపాధ్యాయుల దగ్గర వేడుకో ఫలితముంటుందేమో అన్నారు" లెక్కల మాష్టారు. ఇదంతా గమనించిన స్ఫూర్తి ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడింది.నాతో రా విద్య నేను మాట్లాడి ఒప్పిస్తాను ప్రిన్సిపాల్ గారిని అంటూ కదలబోతుండగా కెమిస్ట్రీ లెక్చరర్ స్ఫూర్తిని ఆపారు.ఈరోజు నువ్వు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు.ఇదే చివరి రోజు కాకుండా చూసుకో.పిల్లలు రోజుకో కారణం చెప్పి , వారి తప్పులకు మనందరిని బలి పశువులను చేస్తారు.అనవసరంగా వారి సమస్యలలో తల దూర్చకు .మన ప్రిన్సిపాల్ గారికి ఎదురు చెప్పడం అంటే సింహం బోనులో తల పెట్టినట్టే.ఇక్కడే కాదు మరెక్కడా ఉద్యోగం వచ్చే అవకాశం లేకుండా చేస్తారు జాగ్రత్త అని హితబోధ చేసారు. నా ఉద్యోగం గురించి ఆలోచించి ఇప్పుడు ప్రయత్నించకపోతే ఈ అమ్మాయి భవిష్యత్తు పాడయిపోతుంది.పరీక్ష రాయకపోయినా , పరీక్ష తప్పినా తనకు వచ్చే సంవత్సరం కాలేజి ఫీజు కట్టడానికి బ్యాంకు నుండి లోన్ రాదు.తన తల్లిదండ్రులకు ఫీజు కట్టి చదివించే స్థోమత లేదు. చదువుకునే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడమే కదా మన వృత్తి ధర్మం.కేవలం పాఠాలు చెప్పటమేనా మన పని రాజ్యలక్ష్మి గారు? అని స్ఫూర్తి అడిగింది. నా సంసారం నేను సంపాదించే నెల జీతంతోనే నెట్టుకురావాలి కాబట్టి నేను ఏ పరోపకారానికి పోయి నా ఉపాధిని కోల్పోలేను స్ఫూర్తి అన్నారు రాజ్యలక్ష్మి గారు.స్ఫూర్తి రమణమూర్తి గారి దగ్గరకు వెళ్లింది.విషయం చెప్పగానే అగ్గి మీద గుగ్గిలం అయ్యారు రమణమూర్తి గారు.కొత్తగా ఉద్యోగంలో చేరిన నీకోసమో లేక సమయపాలన తెలియని ఈ విద్యార్థిని కోసమో కాలేజీ నిబంధనలు మార్చలేము.మన కాలేజీకి ఎంతో మంచి పేరుంది, అది కేవలం ఇక్కడ పాటించే క్రమశిక్షణ వలనే.నియమాల ఉల్లంఘన అనేది ఎట్టి పరిస్థితులలోను జరగని పని.విద్య ఇక ప్రతి సంవత్సరం కాలేజీ టాపర్ గా అందుకునే బంగారు పతకాన్ని మర్చిపోవచ్చు.వచ్చే సంవత్సరం నుంచి తన చదువుకు అయ్యే ఖర్చు ఏర్పాట్లు కూడా తనే చూసుకోవాలి.ఇక ఈ విషయం మీద చర్చ అనవసరం. మీరు మీ విధి నిర్వహణ మీద శ్రద్ధ చూపించండి స్ఫూర్తి అని తన నిర్ణయం తెలిపారు రమణమూర్తి గారు. వెంటనే స్ఫూర్తి అక్కడికక్కడే తన రాజీనామా లేఖ రాసి ఇచ్చింది. ఆయన ఆశ్చర్యచకితులయ్యారు.ఒక విద్యార్థిని కోసం రాజీనామా చేస్తున్నారా లేక మీరు చెప్పింది మీ పై అధికారి వినాలనే పంతం నెగ్గుతుందనుకుంటన్నారా స్ఫూర్తి!. మీ రాజీనామా స్వీకరిస్తాను కానీ విద్య పరీక్ష రాయడానికి అనుమతించను.ఒక్కసారి కాలేజి గేటు లోకి అడుగుపెట్టాక ఇంటి సమస్యలే కాదు వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం కూడా నా ఆలోచనలపై పడనివ్వను. ఇలా పిల్లలు చెప్పే కథలు వింటూ మనం వృత్తి ధర్మాన్ని , కార్య నిర్వహణను పక్కన పెట్టకూడదు స్ఫూర్తి.ఒక సంస్థ నడపాలంటే , అందులో ఉద్యోగలందరు ఒకే నిబద్ధత కలిగి ఉండాలి.ఇక్కడ మన బాధ్యత పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం.ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రమశిక్షణతో జీవించడం నేర్చుకోవాలి.ఇక మీరు వెళ్లొచ్చు అని జాలిగా చూస్తూ బయటకు దారి చూపించారు వారిద్దరికీ రమణమూర్తి.నా రాజీనామాకి బదులుగా తనని పరీక్ష రాయనివ్వక్కర్లేదు సార్ కనీసం తన చెప్పే కారణం వినండి అని అడిగింది స్ఫూర్తి.అప్పుడు రమణమూర్తి చెప్పు విద్య అన్నారు.సార్ కాలేజీకి రావడానికి త్వరగా బయలుదేరాను కానీ వస్తుండగా రోడ్దు మీద ట్రాఫిక్ వల్ల వాహనాలు నిలిచిపోయాయి.మరి మీ ఏరియాలో ఉండే విద్యార్థులంతా వచ్చారే, అందుకే వారు పరీక్ష రాస్తున్నారు అన్నారు రమణమూర్తి .అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.అటుగా వచ్చిన జనం సగం మంది గుమిగూడి ఫోటోలు,వీడియోలు తీస్తూ చుస్తున్నారు లేదా తమ స్వంత పనులు నిమిత్తం పరుగులు పెడుతున్నారు.నేను ఆయన చెయ్యి పట్టుకుని చూసాను, నాడి కొట్టుకుంటుంది వెంటనే అక్కడున్నవారిని సహాయం అడిగాను.పోలీసుల చుట్టూ తిరగాలి,ఆసుపత్రికి వెళ్లే దారిలో అతడి ప్రాణం పోతే మా ప్రాణాల మీదకు వస్తుంది సహాయం చేయలేమన్నారు.అప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ కు, ఆంబ్యులన్స్ కు ఫోన్ చేసాను.అతడి కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.అతడిని ఓంటరిగా వదిలేస్తే, సమయానికి వైద్యం అందిస్తారో లేదో అని, వైద్యులు పరీక్షించి అతని పరిస్థితి తెలిపేదాకా ఆసుపత్రిలో ఉన్నాను.భగవంతుని దయవల్ల అతడకి ప్రాణాపాయం తప్పింది.పది గంటలకు పరీక్ష అయితే నేను ఎనిమిది గంటలకే బయలుదేరాను సార్ కావాలంటే మా ఇంటికి ఫోన్ చేసి అడగండి.కానీ దారిలో ఎదురైన అనుకోని పరిస్థితుల వల్ల గంట ఆలస్యముగా వచ్చాను. కాస్త ఆలోచిస్తూ , అసలు నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మను అన్నారు రమణమూర్తి.విద్య వెంటనే హాస్పిటల్ పేరు, హెడ్ కాన్సిటేబుల్ పేరు చెప్పింది.మానవత్వంతో మనలేని నియమ నిబంధనలు దేనికోసం సార్? ఒంటరిగా ఒక మనిషి ప్రాణాలు కాపాడిన విద్య , మన విద్యార్ధిని అవ్వడం గర్వించదగ్గ విషయం.సామాజిక బాధ్యత లేని క్రమశిక్షణ ఏమి నేర్పుతుంది సార్? ఇప్పటికైనా తనకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి అని అడిగింది స్ఫూర్తి.వెంటనే రమణమూర్తి విద్యకు తన గదిలోనే పరీక్ష రాసేందుకు తగిన ఏర్పాట్లు చేసారు. రాజ్యలక్ష్మి గారని పిలిచి విద్యకు పరీక్ష రాయడానికి తగిన సమయం ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు.పరీక్ష బాగా రాసినప్పటికీ విద్యకి చాలా బాధగా ఉంది.తన భవిష్యత్తు కోసం స్ఫూర్తి మేడమ్ ఉద్యోగంలో చేరిన రోజే రాజీనామా చెయ్యాల్సివచ్చినందుకు.ఏ పరిచయం లేకపోయినా తన కోసం అంతటి త్యాగం చేసినందుకు గురుదక్షిణగా ఏమిచ్చుకోగలను అనుకుంది.సాయంత్రం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగినదంతా చెబుతుండగా రమణమూర్తిగారు వచ్చారు వాళ్ళ ఇంటికి.విద్య తల్లిదండ్రులు చాలా కంగారు పడుతుండగా రమణమూర్తి
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : - S. అన్విక -7వ తరగతి-జి.ప.ఉ.పా.తొగుట.మండలం తోగుట-జిల్లా సిద్దిపేట
• T. VEDANTA SURY

చిత్రం : -M.దీక్షిత -8వ తరగతి -జి.ఉ.పా.తొగుట--సిద్దిపేట జిల్లా
• T. VEDANTA SURY

ఎదురుచూపు!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
• T. VEDANTA SURY

నా వేసవి మధుర జ్ఞాపకాలు:- వి.సింధు శ్రీ-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి