కరోనా కష్టం (బాలగేయం) బడియుంటె బాగుండునమ్మా అన్నమన్న దొరికేది నాకు బాధఫడకు బిడ్డ నువ్వు కరోన కష్టం మనకు వచ్ఛె నాన్నకేమొ కూలి లేక కడుపు ఖాళిగుండెనమ్మా కళ్ళనీళ్ళు వద్దు బిడ్డ మంచిరోజు వచ్చు మనకు తమ్మున్ని చూడమ్మ నువ్వు ఆకలితొ అల్లాడుతుండె ఏమి చేతు నేను బిడ్డా నా గుండె పగిలిపోతుండె వద్దు వద్దు వద్దు అమ్మా ఏడ్వవద్దు వద్దు నీవు చెట్టు పుట్ట చేలనంతా స్వచ్ఛంగ ఉంచాలటమ్మా ప్రాణమిచ్చు ప్రకృతికేమో హాని చేయకూడదమ్మా అపుడె కరోనావంటి క్రిములు మన దరికి చేరవటమ్మా మన కడుపు నింపేటి కాలం ముందుకొచ్ఛె చూడవమ్మా. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు