మానేరు ముచ్చట్లు--నిన్న కొంత రామాలయం, శివాలయం, అందలి శిల్పాలు వాటి నిర్మాణ రీతి,దాని వెనుక నున్న సంప్రదాయ నేపథ్యం గ్రామంలో అరవై ఏళ్ల క్రిందటి దేవాలయా ల స్థితి ఆ తరువాత ప్లవ నామ సంవత్స రంలో జరిగిన అష్టగ్రహకూటమి సంద ర్భంగా గుళ్లో జరిగిన మార్పులు కొన్ని ముచ్చటించు కోవటం జరిగింది. అలాగే రామాలయ పూజారుల విషయం కూడా ప్రసక్తాను ప్రసక్తంగా చెప్ప బడింది.గతంలో వీరన్న గుట్టనానుకుని ఉన్న రంగనాయకుల గుడి గురించి చెప్పిన ప్పుడు కూడా ఊరిలోని చాత్తాద వైష్ణవ కుటుంబాల ప్రసక్తి రేఖామాత్రంగా వచ్చింది.మొన్న ఎలగందుల నుండి ఎదిగిన విద్యాధికుల గురించిన ప్రస్తా వనలోకూర్మాచలం విష్ణుమూర్తిగారి గురించి, నాగరాజు రామస్వామి గురించి చెప్పాను.అయితే ఇక్కడో విషయం చెప్పాలి.నేను ఎలగందుల చరిత్ర రాయబూ నుకున్నానని తెలిసి నన్ను రాయమని ప్రోద్బలం చేసిన వారిలో ఒకరు సంగనభట్ల నర్సయ్య గారైతే మరొకరుకూర్మాచలం విష్ణుమూర్తి గారు. ముఖ్యంగా ఆయనను కలిసినప్పుడల్లా ‘రాంబాబూ!గుట్టమీది నరసింహ స్వామికి మేము తరతరాలుగా పూజా రులం ఆ విషయం నువ్వు రాయాలి’ తన అర్చక వారసత్వాన్ని అతిశయా రాధన తో ప్రేమించిన ఆయన్ని చూసినప్పుడు ఆయన లో నేనో ప్రెఫెసర్ని అని గొప్ప చెప్పుకోవడం కంటే నేను నరసింహస్వామి అర్చకుల వారసుణ్ని అని చెప్పుకోవడమే గర్వంగా తలచి నట్లనిపించేది.దాన్ని ఆంగ్లంలో నాస్టాల్జియా అంటారేమో నేనైతే ‘పురిటిగడ్డ మీది మమకారం’ అంటా ను.అయితే ఆయనకు నేను ఎలగందుల చరిత్ర రాస్తున్న విషయం చెప్పింది ‘ఎలనాగ’. ఎలనాగ’ అన్నది డా. నాగ రాజు సురేందర్ కలం పేరు. ఆయన అన్నయ్య నాగరాజు రామస్వామి లాగానే పేరు పొందిన కవి. నాకు ఆబాల్య స్నేహితుడు.వీరి తమ్ముడు డా.నాగరాజు రవీంద్ర ఆయన కూడా కవితాభినివేశం కలవారే.వీరు ముగ్గురూ మా కుటుంబానికి అత్యంత సన్నిహి తులైన నాగరాజు తిరుమల య్యగారి కుమారులు. విష్ణుమూర్తి గారు ఆయన పెద్ద అల్లుడు మా బాపుకు ప్రియ శిష్యుడు.మొన్న చెప్పినట్టున్నాను.మీది వాడకు వైష్ణవ కుటుంబాల వాళ్ల ఇళ్లు చాలానే ఉండేవని.మొన్న వీరన్న గుట్ట మీది రంగనాయకుల గుడి వివరాల గురించి కే .వెంకట రంగయ్య సారుకు ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. ఆయన నేను పెద్దబడిలో చదువు కున్న రోజుల్లో మాకు చరిత్ర బోధించే వారు. నేనివాళ మా ఊరి చరిత్ర రాయగలు గుతున్నానంటే ఇలాంటి గురువుల చలవే కదా! కనుక కూర్మాచల వంశీయులు ఎలగందుల లోని నరసింహస్వామి ఆలయానికి తరతరాలుగా అర్చక స్వాములు.అప్పట్లో శ్రావణ మాసం వచ్చిందంటే గుట్టమీదికి వచ్చే భక్తుల సందడి ఉండేది.వీరి వంశీకులు అక్కడ పూజ చేసేవారు. అలాగే రామాలయ అర్చకులు కూడా వారి వంశీయులే. ఇక నాగరాజు తిరుమలయ్య గారు మా ఊరికే గాక చుట్టు ప్రక్కల పలు గ్రామాలకు వైద్యులు.దీర్ఘకాలిక రుగ్మత లను ఆయన వైద్యంతో నయం చేసే వారు. వైద్యులకు ‘హస్తవాసి’ అంటారు. మంచి హస్తవాసి గల వైద్యులు నాగరాజు తిరుమలయ్య గారు. నిజం చెప్పాలంటే నాకు ప్రత్యేకంగా ఈ కుటుంబంతో చిన్నప్పటినుంచీ అవి నాభావ సంబంధం కొనసాగుతూ వస్తు న్నది. ఒకరకంగా నాజీవితాన్ని కొత్తమలు పు తిప్పిన ఘనత ఆకుటుంబానికే చెల్లు తుంది.నాగరాజు రామస్వామిగారి తండ్రి నాగరాజు తిరుమలయ్యగారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. వారు మా బాపుకు ఆత్మీయమిత్రులు. నేను ఎలగందులలో ఉన్న పదహారేళ్లలో వారు మా ఇంటికి రాని రోజులు చాలా తక్కువ.వారి ఇల్లు ఊరికి వాయువ్య దిశలో చివరిదైతే మా ఇల్లు ఈశాన్య దిశలో చివరి ఇల్లు.వాళ్ల ఇంటికి మా ఇంటికి ఎంతలేదన్నా కిలోమీటరు పైనే ఉంటుంది.ఆయన ఒక పాత సైకిలు మీద వెళ్లి ఊరిలో కొంత మందికి వైద్యం చేసేవారు.ఒక జనుప సంచీలో కొన్ని మందులు ఇంజక్షన్ చేసే పరికరాలు ఉండేవి.ఆయన హస్తవాసి చాలా మంచిది.ఆయన ఊరి వాళ్లకే కాకుండా దూర దూర గ్రామాలవారికి కూడా వైద్యం చేయటం నాకు గుర్తు. కొందరు దీర్ఘకాలిక చికిత్స కోసం వారి ఇంటి వసారాలో వండుకొన తిని వైద్యం చేయించు కోవటం కూడా లీలగా జ్ఞాప కం.ఆరడుగుల పొడుగు మనిషి ఆజానుబాహువు ఊరి వారందరికీ ఆప్తుడు. నాకు మాత్రం ఆయన సైకిలు వరదాత.అప్పట్లో సైకిలుండమంటేనే గొప్ప.సైకిలు తొక్కడం వచ్చిందంటే మరింత గొప్ప.కిరాయ సైకిలు తెచ్చుకుని నేర్చుకునే స్తోమత కాదు.అలాంటి సమయంలో నా ఉబలాటం ఆయన సైకిలుతో తీరేది.వారు మా ఇంటికి వచ్చారంట్ అధమ పక్షం అరగంట ఉండే వారు.ఆయన రాగానే నేను బయటకు వెళ్లి ఆయన సైకిలు మీద ఎక్క సారి పెద్ద మసీదుదాకా వెళ్లి వచ్చేవాడి ని. సీటు ఎక్కడం వచ్చేది కాదు కైంచి తొక్కుతూ నడిపే వాణ్ని అనేకంటే తోసేవాణ్ని అనటం సబబు.ఆ ఊరివారే అయిన విష్ణుమూర్తి గారు మా బాపుకు శిష్యులు,తిరుమల య్యగారికి పెద్ద అల్లుడు.ఆయన గురించి నాకు తెలియడం నా డిగ్రీ అయిన తరు పవాతే.ఆయన ఉస్మానియా యూనివర్సి టీలో లా కాలేజీలో పనిచేసేవారు లెక్చర రుగా.నేను బియస్సీ చదివిన తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలనుకుని సలహా కోసం ఆయన దగ్గరికి బాపుతో కలిసి వెళ్లాను.ఉస్మానియా యూనివర్సి టీ చూడటం అదే మొదటిసారి. అప్పు డేదో ప్రయత్నం చేశాను కానీ అది ఎందు కో కలిసి రాలేదు కానీ విష్ణుమూర్తిగారికి మా బాపంటే ఎనలేని గౌరవం అని మాత్రం తెలిసింది. ఇంతలోనే నాగరాజు రామస్వామి గారి ప్రమేయంతో నేను ఆదిలాబాదు జిల్లా లోని సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లి అక్కడ సర్సిల్కు మిల్లులో కొన్నేండ్లు అది మూత బడిన తరువాత బి య్యెడ్ చేసి ఉపా ధ్యాయునిగా కూడా అక్కడే పని చేసి ఉద్యోగ విరమణ పొందటం కూడా జరిగింది.అలా నలభయ్యేళ్ల కాలం కాగజ్ నగర్లో గడిచింది. నేను కాగజ్ నగర్ వెళ్లిన కొద్ది రోజులకే రామస్వామిగారు విదేశా లకు వెళ్లిపోవడం, తిరుమల య్యగారు హైదరాబాదు తరలి వెళ్ల డం దాదాపు ముప్పయ్యేళ్ల పాటు వారి కుటుంబంతో ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. నేను రిటైర్ అవడానికి కొంచెం ముందు రామస్వామిగారు హైదరా బాదులో ఉంటున్నారని తెలిసి కలవ డం జరిగింది. అప్పుడు చాలా ఏండ్ల తరువాత నన్ను చూసిన తిరుమల య్యగారు ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని బాపును చూసినట్టయింది అని బాపును తలచుకోవటం నేను మరువలేను.వారప్పటికి వందకు దగ్గరలో ఉన్నారు.ఆ తరువాత కొద్ది రోజులకే గతించారు. ఆయన సతీమణి రంగమ్మ గారు. నాకు తెలిసి దంపతు లిద్దరూ నిండు నూరేళ్లు జీవించిన వాళ్లు వీరు తప్ప ఎవరూ లేరు. మొన్న ఒక నెల క్రితం నూటా మూడేండ్లకు ఆమె జరిగి పోయారు.తిరుమలయ్య గారి చిన్న కుమార్తె శ్రీమతి ధర్మపురి సరళ ఆమె కూడా అన్నయ్యల బాట లోనే రెండు పుస్తకాలు వెలువరించా రు. ఆమె అక్కయ్యకు ఆబాల్య స్నేహితురాలు.‘ఎలనార’ (నాగరాజు రామస్వామి) ‘ఎలనాగ’ (నాగరాజు సురేంద్ర)గా సుప్రసిద్ధులైన ఇరువురు కవులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితులు, సుప్రసి ద్ధులైన కవులు ఇరువురూ అనేక పుస్తకాలు వెలువరిం చారు.వారు ఎలగందుల కీర్తి కిరీటంలో తళతళ మెరిసే అనర్ఘ రత్నాలు.-రామ్మోహన్ రావు తుమ్మూరి .


కామెంట్‌లు