జొన్న పేలాలతో చల్లదనాన్ని ఇచ్చే లడ్డు - ఎండా కాలంలో ఎక్కువ చెమటను తగ్గించి చల్ల ధనాన్ని ఇచ్చే ఆహార పదార్థాల వినియోగం తో మన ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవడం చాలా ముఖ్యం. కొన్ని తెల్ల జొన్నలను మూకుడులో వేసి వేయించితె గింజలన్నీ టపటపా పేలి విచ్చుకునితెల్లని పేలాలుగా తయారవుతాయి. జొన్న పేలాలు వేడి తగ్గిన తరువాత మిక్సీ పట్టి పిండిని తయారు చేసుకోవాలి. కొద్దిగా నీరు తీసుకుని ఒక గిన్నెలో వేడి చేసి తాటి బెల్లం. లేదా మంచి బెల్లం తగినంత నీటిలో వేసి మరిగించి పానకం తయారు చేసుకోవాలి. ఈ బెల్లం పానకం లో కొద్దిగా యాలకుల పొడి కలపాలి. తయారైన జొన్న పిండిలో బెల్లం పానకం వేసి లడ్డూలు కట్టుకోవాలి. కమ్మనైన ఘుమ ఘుమలాడే లడ్డూలు రెడీ. ఈ లడ్డూలు ఏరోజుకారోజు తయారు చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన వచ్చు ఇవి శరీరానికి, చల్లదనం, ఆరోగ్యం, బలం. -పి . కమలాకర్ రావు


కామెంట్‌లు