సుమతీ శతకం పద్యం 60(౬౦) అధరము కదిలియుఁ గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవముఁజూడఁ బాపము సుమతీ తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... ఏ అధికారి ఐనా తన పెదవి కదపక, మంచి మాట మాట్లాడ కుండా చెవిటి వాడిలాగా వ్వయవహరిస్తే, సదరు అధికారి జీవములేని కట్టెతో సమానము. అటువంటి అధికారి వద్ద పని చేయటము అటుంచి, చూచుట కూడా పాపహేతువు కాగలదు.... ...అని సుమతీ శతకకారుని వాక్కు. ఏ వ్యక్తి ఐనా, తన యోగ్యత వల్ల అధికారి అయినప్పుడు, తన యుక్తాయుక్త విచక్షణ వుపయోగించి మంచి చెడులను వేరుచేసి గ్రహించ గలగాలి. తన కార్యాలయంలో జరిగే తప్పొప్పులను క్షీర నీర న్యాయంతో సరిదిద్ద గలగాలి. ఆవిధంగా వ్యవహరించలేని అధకారుల వద్ద పనిచేయటం మనకు అశనిపాతంలా అవుతుంది అని భావం. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు