గ్రామీణ ప్రాంత పేద , మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా పనిచేస్తూ,ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ ,వినూత్నమైన బోధనాభ్యసన సామాగ్రి (TLM) తయారు చేస్తూ ,పిల్లల సంఖ్యను పెంచి వారికి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులను గుర్తించి వారికి "మనం మన ఊరి బడి "(MMVB)స్వచ్ఛంద సేవా సంస్థ నెల్లూరు వారు మనం మన ఊరి బడి(MMVB) అవార్డు లను బహూకరించారు.ఇందులో వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఇల్లూరి క్రాంతి కుమార్ కు అవార్డు లబించింది.మనం మన ఊరి బడి ఫౌండర్ శ్రీ పెయ్యాల హజరత్ గారు జూమ్ మీటింగ్ నిర్వహించి అందులో ఉపాధ్యాయులకు అవార్డులను బహుకరించారు .ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు .తమ విలువైన సలహాలను, సూచనలను అందించారు .
మనం -మనఊరి బడి -2020 అవార్డులు : వెంకట్ , మొలక ప్రతినిధి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి