నేర్చుకుందామా ..:---డా.కె.ఎల్.వి.ప్రసా ద్,--హనంకొండ,వరంగల్.

చేతిఖర్చులకు 
చిల్లరడబ్బులు ,
పిల్లలకివ్వడం,
సాధారణం 
అయిపొయింది !


బడికి వెళ్లడానికి 
ఇబ్బంది పెట్టే 
గడుగ్గాయలకు 
డబ్బులిచ్చి 
సముదాయించడం 
మాములు 
అయిపొయింది !


చెప్పిన పని ,
చెయ్యలంటే ....
పిల్లలకు ---
లంచమివ్వడం ,
పెద్దలకి ప్పుడు ,
సాంప్రదాయం 
అయిపొయింది !


చుట్టపట్టాలు ...
ఇంటికివస్తే ,
తిరుగు ప్రయాణంలో 
అంతో ..ఇంతో ...
పిల్లల చేతిలోపెట్టడం ,
ప్రేమకు .....
చిహ్నం అయింది !


ఇలాంటి .....
చిన్న ..చిన్న మొత్తాలను 
దాచుకుంటే ...
ఒకనాటి కి 
పెద్దమొత్తాలవుతాయ్ !
దీనికోసం ---
' కిడ్డీ బ్యాంకులు '
అక్కరకొస్తాయ్ !
' పొదుపు 'చేయడం ,
నేర్పిస్తాయ్ ...!!