మధిర లోని టి.వి. ఎమ్. జి. ఉన్నత పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ
 ఖమ్మం జిల్లా, మధుర లోని తేళ్ల వసంతయ్య స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వాగ్దేవి (సరస్వతి దేవి) విగ్రహావిష్కరణ గురువారం ఘనంగా జరిగింది.
వాగ్దేవి  విగ్రహాన్ని పాఠశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు గోళ్లముడి మల్లికార్జున శర్మ ఆర్థిక సాయంతో తన తల్లితండ్రులు వెంకట అప్పారావు, సీతారావమ్మ జ్ఞాపకార్థం, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 
తల్లి/తండ్రి లేని విద్యార్థులచే వాగ్దేవి విగ్రహ ఆవిష్కరణ చేయించటం విశేషం. 
విగ్రహ దాత గోళ్లముడి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ ప్రతి స్కూల్ ఆవరణలో సరస్వతి దేవి విగ్రహం ఉండటం చాలా మంచిది అనే ఉద్దేశ్యంతో గతంలో తాను పనిచేసిన మరో రెండు పాఠశాలల్లో కూడా ఇదే విధంగా "వాగ్దేవి" విగ్రహాలను స్వంత నిధులతో ఏర్పాటుచేసినట్లు తెలియజేశారు.
ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమ నిర్వహణలో విశేషంగా సహకరించిన పాఠశాల పూర్వ విద్యార్థి సంఘానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. 
ఈ కార్యక్రమంలో గోళ్లముడి మల్లికార్జున శర్మతో పాటు వారి కుమారుడు శ్రీహర్ష, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు పుతుoబాక శ్రీకృష్ణ ప్రసాద్, మాధవరపు నాగేశ్వరరావు,  వై. నాగభూషణం, బాబ్ల, మక్కెన నాగేశ్వరరావు, వై. రవీందర్, టి. వీరభద్రరావు, కర్నాటి రామ్మోహన్ రావు, పారుపల్లి వెంకటేశ్వరరావు, ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, దాత సహాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ప్రభాకర రావు, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థినీ విద్యార్థిలు పాల్గొన్నారు.
🌸🌷🌸

కామెంట్‌లు