జయశంకర్ సార్ జయంతి :- పి, రిషిక-9వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట -మం గంభీరావుపేట
 ఆ వె 
చక్కనైన మనిషి  జయశంకరున్ గారు 
 ముందుకొచ్చి నాడు ముదము తోడ
తీర్చిదిద్దనెపుడు తెలగాణ రాష్ట్రాన్ని 
ఉద్యమమ్ము నడిపె నోర్పుగాను
ఆ వె 
ఉద్యమంబు లోన నుత్సాహముగ నుండి
పలికె మాట తీరు పదును గాను
ఆంధ్ర పాలనంత నన్యాయ ముందని 
ధర్మమార్గమెంచి తగువు జేసె 
ఆ వె 
స్వార్థబుద్దితోడ సంపద నంతయు  
ఎత్తుకెల్లుచుండ మొత్తుకొనుచు
ఉద్యమమ్మ జేయ నుత్తమమని జెప్పి 
ముందు నడిచి నారు ముద్దుగాను

కామెంట్‌లు