సదస్సు నాలుగవ సమావేశం మధ్యాహ్నం గం.4.00 నుంచి 5.00 వరకు! కవితా పఠనకార్యక్రమానికి అధ్యక్షులు శ్రీ కె.శివారెడ్డి గారు.
ఆ సమావేశంలో తెలుగు, కన్నడ, మళయాళం,
సింధీ,ఉర్దూ, డోగ్రి,నేపాలీ, సంతాళి,ఒడియా బాలగేయ కవులు పాల్గొన్నారు. అధ్యక్షులు నా
గురించి పరిచయ వాక్యం ఆంగ్లంలో చెప్పి
బాలగేయాలు వినిపించవలసిందిగా కోరారు.వేదికపై కూర్చున్న నేను పోడియం దగ్గరకు
వెళ్ళాను.ఏదో తెలియని ఆందోళన. ఒక జాతీయ
స్థాయి వేదికపై నిలబడి మాట్లాడడం,కవితాపఠనం
చేయడం అదే తొలిసారి!ఆంగ్లం లో సభను
సంబోధించి తెలుగులో ఒక బాలగేయం వినిపించాను.ఆ బాలగేయం పేరు'ఎదిగే తరులు'!
//అనురాగం అమ్మే అయితే/బాధ్యతగా నాన్నే
ఉంటే/బాల్యానికి తిరుగే ఉండదు/భవిష్యత్ కు
భయమే ఉండదు//ఆదర్శం గురువే అయితే/
నీతిగాను నేతలు ఉంటే/మా వృద్ధికి ఎదురే ఉండదు/మా మంచికి అడ్డే ఉండదు//ఆరోగ్యం
మా పరమైతే/ఆనందం మాతో ఉంటే/బాల్యానికి
ఉండదు గండం/బలహీనం కాదులె దేశం//మేమంతా ఎదిగే తరులం/పదిలంగా కాపాడండి/దేశానికి మేలును చేస్తాం/సుఖశాంతుల నిలయం
చేస్తాం//...ఈ గేయం ఆంగ్లానువాదం ఆ వెంటనే
చదివి వినిపించాను.శీర్షిక:Growing Plants
// If Affection became Mother/ If
Responsibility became Father/There will
be no backwardness to our Childhood/
And there will be no fear to our future//
If the teacher became Model/If the leaders became honest/There will be
no opposition to our welfare//If the health belongs to us/If the pleasure
is always with us/There will be no danger to our childhood/And the nation
will never be weak//We,the children are
the 'Growing Plants'/Please save us
Carefully/We will do the best to our
Nation/And we certainly give it Happiness and Peacefullness!//మరో గేయం పేరు'నిత్యానందం'!//బుద్ధిగ మీరూ
చదివారా/అమ్మకు నాన్నకు ఆనందం//శ్రద్ధగ పాఠాల్ విన్నారా/గురువు గారికి ఆనందం//
హింసను వదిలి తిరిగారా/గాంధీతాతకు ఆనందం//మతాలు మరచి మసలారా/భరతమాతకు ఆనందం//చేయీ చేయీ కలిపారా/
భూమాతకు పరమానందం//మానవత్వం తో
ఉన్నారా/మానవ జాతికి నిత్యానందం//ఈ గేయం
శీర్షికకు ఆంగ్లంలో 'Evergreen Pleasure'అని
పేరు పెట్టాను.//If you study sincerely / Your
Mother and father will be pleased// If you
listen your lessons with interest/The teacher will be pleased//If you leave the
violence / Our great Gandhi will be pleased// If you forget your religions/
Our beloved Bharat Matha will be pleased//If you embrace all of your hands for good deeds/The Earth will be
Very pleased//If you move with humanity/The whole mankind will be
Pleased eternally//మరో గేయం'అమ్మ తోడు'
(The touch of Mother) చదివాను. ఈ మూడు
గేయాలకు మంచి స్పందనే వచ్చింది. గేయపఠన
కార్యక్రమం ముగిసింది. అంతలో దీప్తి పబ్లికేషన్స్
అధినేత గారు "మా మంచి నాన్న"గేయసంపుటి
పుస్తకాలు తెచ్చారు. సాహిత్య అకాడమీ కార్యక్రమం ముగిసింది.మిత్రులు డా.పత్తిపాక
మోహన్ గారికి ఆ రోజే అచ్చయిన పుస్తకాలు చూపించి"పెద్దలున్నారు.వారిచే పుస్తకావిష్కరణ
చేయించాలని ఆశపడుతున్నాను"అన్నాను.నా
మాటలు ఇంకా ఆ ఆవరణలోనే ఉన్నాయి. మోహన్ గారు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాహిత్య అకాడమీ తెలుగు
సలహా మండలి సంచాలకులు డా.ఎన్.గోపీ గారు
పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ
కార్యక్రమంలో శ్రీ కె.శివారెడ్డి గారు,శ్రీ పత్తిపాక
మోహన్ గారు,వాసిరెడ్డి నవీన్ గారు,శ్రీ పైడిమర్రి
రామకృష్ణ గారు శ్రీ ఎం.హరికిషన్ గారు పాల్గొన్నారు. మర్నాడు ఉదయం డా.ఎన్.గోపి
గారితో నేను, హరికిషన్ ఫోటో దిగాం. ఆ రోజు
ఉదయం గం.11కు విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కి సాయంత్రానికి పార్వతీపురం చేరుకున్నాను.
(సశేషం)
214. బాలగేయ పఠనానికి సాహిత్య అకాడమీనుంచి పిలుపు(మూడవ భాగం)::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి