221.పురస్కారాల సంవత్సరం:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.


 2018 లో ఐదు పురస్కారాలు వచ్చాయి. నా బాలసాహిత్య ప్రయాణం అప్పటికి 40 వ యేట

అడుగు పెట్టింది.ఆ సంవత్సరంలో  

ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్,విజయనగరం వారు బాలసాహిత్య రంగంలో చేస్తున్న కృషికి అభినందిస్తూ రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారం

అందజేశారు.డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ సముద్రాల గురుప్రసాద్ గారి ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నాను.ఆ తరువాత 10 TV అసిస్టెంట్

ఎడిటర్ మరియు నంది అవార్డు గ్రహీత శ్రీ తాడ్డి

సతీష్ కుమార్ (హైదరాబాద్) గారు 

వారి తల్లిదండ్రులు శారదమ్మ,అప్పలస్వామి పేర్లు

మీదుగా నెలకొల్పిన "తాడ్డీస్ బిలైట్ అవార్డు 2018" (శారదా స్వామి అవార్డు)ను బాలసాహిత్యంలో కృషి చేస్తున్నందుకు గాను

ప్రదానం చేశారు. నంది పురస్కార గ్రహీత, ఒక

మంచి రాజకీయ విశ్లేషకులు వారి ద్వారా పురస్కారమందుకోవడం నాకు చాలా ఆనందదాయకం,ప్రోత్సహకరం అయింది.2018

లోనే కరీంనగర్ లో శ్రీ త్రివేణి సంస్థ, మెట్పల్లి,

కరీంనగర్ వారిచే శ్రీ వాసాల నరసయ్య బాలసాహిత్య పురస్కారమందుకున్నాను.ఆ 

సంవత్సరం లోనే బాలసాహిత్య రంగం లో కృషి

చేస్తున్నందుకు గాను డా.ఎన్.టి.ఆర్. కళారాధనా

పీఠం,విశాఖపట్నం వారిచే ఎన్.టి.ఆర్. గౌరవ  పురస్కారం ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎస్.ఎల్.ఎన్.స్వామి గారి ద్వారా అందుకున్నాను.

2018 అక్టోబరు 22వ తేదీతో పొట్టి శ్రీరాములు 

తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ.ఆచార్య అలేఖ్య గారి వద్ద నుంచి బాలసాహిత్యం లో చేసిన

సేవలకు గుర్తింపుగా"శ్రీ అంగలకుదుటి సుందరాచారి స్మారక పురస్కారం"(2017 కీర్తి పురస్కారం)అక్టోబరు 26 న అందజేస్తున్నామని

ఒక లేఖ వచ్చింది.శ్రీ అంగలకుదుటి సుందరాచారి

గారు ప్రముఖ బాలసాహిత్య రచయిత్రి డా.కందేపి

రాణీప్రసాద్ గారి తండ్రి గారు. తండ్రి గారి పేరున

రాణీప్రసాద్ మేడం గారు బాలసాహిత్యం రంగంలో కీర్తి పురస్కారం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియమ్ లో జరిగింది.

అక్కడికి ఉత్తమ రచయిత్రి కీర్తి పురస్కారం

అందుకోడానికి డా.కందేపి రాణీప్రసాద్ వచ్చారు.

కాకతాళీయంగా జరిగిన ఆ సంఘటన చాలా ఆనందాన్ని కలిగించింది.మమ్మల్ని  అభినందించడానికి ఎన్.బి.టి. సంపాదకులు డా.పత్తిపాక మోహన్ గారు వచ్చారు. ఆ రోజు కీర్తి పురస్కారాలందుకోడానికి

వివిధ సాహిత్య ప్రక్రియలలో లబ్దప్రతిష్టులైన రచయితలు,రచయిత్రులు, కవులు,పండితులు

23 మంది వచ్చారు.సభకు అధ్యక్షులుగా తెలుగువిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారు వ్యవహరించారు.ముఖ్య అతిథిగా సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి సురభి

వాణీదేవి గారు,ఆత్మీయ అతిథిగా ప్రముఖ  సినీగేయకవి శ్రీ చంద్రబోస్ గారు వచ్చారు.వారందరి చేతుల మీదుగా కీర్తి పురస్కారం అందుకునే భాగ్యం కలిగింది. 2018

లోనే మే నెల 6న ఈటీవీ తెలుగు వెలుగు కార్యక్రమంలో నా గురించి పరిచయం కూడా

ప్రసారం చేశారు.2018లోనే అమరావతి బాలోత్సవ కమిటీ వారు నిర్వహించిన అభ్యుదయగీతాల పోటీలో "గుప్త భాగ్యం"గీతానికి

రాష్ట్ర స్థాయి బహుమతి దక్కింది. ఈ సంఘటనలన్నీ మంచి రచనలు చెయ్యాలన్న బాధ్యతను మరింత పెంచాయి.(సశేషం)